మరపు రాని మరో రోజు

http://kottapali.blogspot.com/2008/05/blog-post_26.html లొ చెప్పినట్లుగా, మళ్ళీ మళ్ళీ గుర్తుచెసుకోవాలి!

నేను ఈ గడ్డపై అడుగిడిన రోజు, తెలియకనే సైనికురాలిగా మారానని తెల్సిన రోజు. ఎన్నో రొజుల్లా ఈ రోజు వచ్చిపోతున్నా, ఇంకా సమరం సాగిస్తూనేవున్నాను కనుక తిరిగి శంఖంపూరించే రోజిది. తోటి సిపాయి కొరకు చుట్టూ చూస్తూ, కలిసిన మనిషికి వుండాల్సిన లక్షణాలన్నీ తన లక్ష్యసిద్ధికి ఒకటొకటిగా మరుగై, మరుపై, మసకై ఎక్కడొ మనసు మూలల్లో చిన్న మచ్చలుగా మిగిలుంటే, కలల ఎండలో సాగిన నీడల్లా దర్శించుకుంటూ కరకు గుండెకై సాధన కసరత్తులు చేస్తూనే సాగనంపానీరోజుని...

కోడిగుడ్డు పులుసు వుడికిస్తూ కొంచం, palak paneerకి పోపువెస్తూ మిగిలిన సగం 1936లో విస్వనాధవారు వ్రాసిన "మాక్లీ దుర్గంలో కుక్క" కథ తెలుగునాడిలో చదవటం నాకీ రోజుకి పండుగ పర్వం!

7 comments:

  1. బ్లాగు లోకానికి స్వాగతం.

    -- విహారి

    ReplyDelete
  2. ఎదురుగా వుండి గుక్కతిప్పుకోకుండా చెప్పున అనుభూతి కలిగిందండీ ఒక్కవాక్యమూను. మీరు మొదలుపెట్టడమే తరువాయి. కధలో, కబుర్లో ఏవి అనుకుంటే అవి రాసేయండి.
    మీరేం అనుకోకపోతే, నల్లతెరమీద తెల్ల అక్షరాలు చదవడం కష్టంగా వుంది. మరి నాఒక్కదానికేనేమో.

    మాలతి

    ReplyDelete
  3. ఒక స్నేహితురాలి ద్వారా తెలిసిన విషయమిది that black background is energy saving. So I went with that. కానీ మీవంటివారి అభిప్రాయం కూడా ఇంకో అలోచన కలుగచేస్తుంది. మార్చేస్తున్నానండి!

    ReplyDelete
  4. విహారి గారు, మీరు చేప్పిన సూత్రాలు http://blog.vihaari.net/2008/05/2.html పాటిస్తానండి. ఇక్కడ e-వ్రాలుకి, మీమాటకి క్రుతజ్ఞతలు [ఎంత కుస్తీపట్టినా ఈ పదంలో అచ్చుతప్పు వస్తూనేవుంది;కానీ మీ సూత్రంవాడి వదిలేస్తున్నాను!]

    ReplyDelete
  5. అవును లెండి. ఒకోకప్పుడు సౌకర్యాలకి ధరలుంటాయి కదా. కృతజ్ఞతలలో క కింద ఋ, మీరు వాడుతున్న కీబోర్డులో చూసారా. నేను గౌతమీ వాడుతున్నాను. ఇందులో ప్లస్ కీ.

    ReplyDelete
  6. యూనికోడ్ లో అయితే kR అని రాస్తే కృ వస్తుంది.

    -- విహారి

    ReplyDelete
  7. మీ ఇరువురికీ కృతజ్ఙతలు. తెలుగులో వ్రాసేందుకు లేఖిని వాదుతున్నను.

    ReplyDelete