పురాతనమే కావచ్చు ఈ చంద్రోదయం
కాస్త వెనుగ్గా రానున్న సూర్యోదయమూ...చీకటి కమ్మిన హృదయాలు
నీడలో నివృతమైన పరిసరాలు
మరి కాస్త ప్రాచీన ఆచూకీకి
త్రోవ చూపవచ్చు
గమనించాలి, గుర్తించాలి, గమనం సాగించాలి
రిక్త హస్తాలు చాపగానే వెన్నెల నిండినట్లుగా
కనులు తెరవగానే కాంతి చేరినట్లుగా
గాలి, నీరు గలగలలాడుతూ
పూరేకుల్లో, ఆకుదొన్నెల్లో
మబ్బుగిన్నెల్లో, అలల కుంచెల్లో
మబ్బుగిన్నెల్లో, అలల కుంచెల్లో
కొత్త పరిచయం చేసుకున్నట్లుగా
సరికొత్త పాత చిరునామాలు
గుండె నిండా రాసుకుంటూ ఉంటావు
గుండె నిండా రాసుకుంటూ ఉంటావు
నడవాలి, నర్తించాలి, ఆంతర్నేత్రం తెరిచి చూడాలి
సనాతనమే కావచ్చు ఆ ఆత్మావలోకనం
అనాది నిధనమనే హితవచనమూ...
తృప్తి, శాంతి పురివిప్పి
తృప్తి, శాంతి పురివిప్పి
చేతనలో, చింతనలో
స్వరంలో, స్పందనలో
నిత్య చలనం గావించినట్లు
సతతం అనునయ స్పర్శనిచ్చే విశ్వజాడలు
సతతం అనునయ స్పర్శనిచ్చే విశ్వజాడలు
ఆత్మ నిండా పరుచుకున్న స్థితిలో ఉంటావు
నిరాంతకమైన చోట ఎప్పుడూ నిశాంతకమే - సూర్యుడో, చంద్రుడో, చుక్కలో - ఏదో వెలుగు ఎప్పుడూ, ఎల్లప్పుడూ! చప్పట్లు - ఈ కవితలోని ప్రతి పంక్తికి!!
ReplyDeleteప్రభాతము లోకి సాగే ఆత్మలో కాంతి చేరటం అంటే అంతేగా మరి.. నెనర్లు లలితా...!
Delete
ReplyDeleteఅంతర్నేత్రము తెరిచిన
నంతర్భాగము న వెలయు నలతలు కలతల్
వింతగ తొలంగి సత్యము
శాంతంబై యాత్మ కాంతి చక్కగ నెలయున్
జిలేబి
జిలేబీ గారు! నెనర్లు. చిటికెలో యే వచన్నాన్ని అయినా పద్య రూపానికి మార్చగలరు సుమీ
Deleteచాలా బాగుంది
ReplyDelete