మొయిలు బొత్తి

నిర్నిమేఘ ఆకాశం అమాంతంగా అల్లికల పోగుల్లా గుట్టలు పోసింది
కొలను దాచుకున్నవన్నీ బింబాలై తేలియాడాయి 
మబ్బులు పుటలుగా కవిత రాసుకుంటూ ఉన్నానా..అంతలోనే
ఆకుల్లా పరిచి ఎవరో మరి చిత్ర రచనలు చేస్తూ పోయారు...
విస్తుపోతూ నేనూ కనుల యానం చేస్తూ గడిపాను,
గుమ్మాన ఆగిన నీలి మబ్బు కన్ను గీటి కదిలిపోయేవరకు!








1 comment:

  1. మొయిలు బొత్తి - చప్పట్లు ఈ పదాలకి.
    అలాగే ఆ ఆఖరి లైన్లో - కన్ను గీటి పోయిన నీలి మబ్బుకి - మరిన్ని చప్పట్లు - గా....ఠిగా!

    ReplyDelete