పొడిగింత

పంతంగా నీడల్ని పరిగెత్తిస్తూ
మొండి దేహంతో ఎండ
రూపం, రంగు లేని నీటిలోకి జారిపడింది
భళ్ళుమని నిశ్శబ్దశ్రుతితో తెల్లారింది

వంతుగా ఆకుల్నీ, కొమ్మల్నీ ఊపుతూ
మొగ్గ దేహంలోకి గాలి
రూపం, రంగు అద్దుకుంటూ ఒదిగిపోయింది
రివ్వుమని రెక్కలతో పిట్టపాట హోరెత్తింది

నీళ్ళు, పూలు నవ్వుతున్నాయి
ముళ్ళు, రాళ్ళు నీడల్ని మోస్తున్నాయి
నిండుగా ఉనికి సంతరించుకుని జాగృతి
రెండుగా చూస్తున్న అద్వైతమే స్థిరమని ఖాయం చేసింది...!

5 comments:

 1. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు? ఈ పొడిగింత బ్లాగుక్కూడా కొంచెం పంచండి మరి!

  ReplyDelete
  Replies
  1. లల్లీ! చాలా ఆనందం. ఒక కంటికి మన చూపు దిశ గా మారింది అనే ఊహ మరింత బలం ఇస్తుంది!

   Delete
 2. అబ్బ..ఇంత బాగుంటుందా ప్రకృతి! చూపకనే చక్కగా చూపారు నేచర్ ఇంకా నేచురల్ గా.. మరువం అందం, మీ పరిశీలన లో మెరిసి పోతున్నది!!

  ReplyDelete
  Replies
  1. పృధ్వీ! ఒకటి తెలుసా? ఎదో ఒకనాటికి మీ చేత మంచి చిత్ర లేఖనంలో మంచి విశిష్టమైన రచన చేయిస్తానని నాకు నమ్మిక. చూస్తూ ఉంటాను ఆ తరుణం కోసం. నెనర్లు!

   Delete
 3. ..మీ ఉషోదయ కళాకాంతుల కంటే ఎక్కువ మెరుపులు నే దిద్దలేను. నిజం ఉషా గారు, మీ రచనా వైశిష్ట్యం చాలా అందంగా అనిపిస్తుంది కనిపిస్తుంది !!..థాంక్స్.

  ReplyDelete