(మా పాప రాసిన) ఆలాపన!

(NRI గా ఎదిగిన తను, పాటకి తనకి నడుమ అనుబంధాన్ని పూర్తిగా తనకి వచ్చిన తెలుగుతో అనుసంధానం చేస్తూ రాసుకుంది.. నేను కేవలం సరైన పర్యాయపదం, వ్యాకరణం సరిదిద్దాను)

వరాల వానగా వచ్చిందో గీతం-
మునుపెరగని ఆ పరిచయంలో
రేగిన వాంఛతో మొదలైయిందీ,
బంధం గట్టిపడింది.

గానంతో కీర్తి శిఖరాలు చేరే అభిమతం
ఉత్సాహపు వెల్లువైంది నాలో...
హత్తుకొని మత్తెంకించేసి, బానిసైన
నాతో రాగాలు కట్టించింది.

పాటలుగ మారిన ఈ పరిచయం
మళ్ళి మళ్ళి కరుణించి మరలివచ్చింది
మదిలో అవే పదాలు భాగమౌతుంటే
తనలో లీననం అయిపోయాను.

అవసరం లేదనిపించిన సంగతుల్లోనే
సారం వుందని తెలియని స్థితిలో
కరిగిపోయాను సరాగమై-
ఆవిర్భవించింది నా హృదయగానం
జనించింది నాకై నూతన గమ్యం...!

2 comments:

  1. కరిగిపోయాను సరాగమై-
    ఆవిర్భవించింది నా హృదయగానం
    జనించింది నాకై నూతన గమ్యం...!

    అంత్యం అత్యంత అరుదైన అద్భుతం.��
    ..☺

    ReplyDelete
    Replies
    1. తను చాలా ప్రోత్సాహం అందుకున్నట్లుగా సంబరపడింది పృధ్వి! ఎక్కువగా ఇంగ్లీష్ లో రాస్తుంది కానీ, ఇలా ఒకటైనా తెలుగులో రాయటం అందరికీ బాగుంది...నెనర్లు!

      Delete