I
dread the day I will no longer hear from someone I am morally and
emotionally attached.. నేను దగ్గర ఉండగా కోల్పోయిన నా కుటుంబంలోని ఐదుగురి
మరణాల వెంబడి నా జీవిత గమనం నుంచి... ఎవరైనా మనని విడిచిపోతే 'వారితో
సంతోషంగా గడిపిన సంఘటనలు గుర్తుచేసుకుని నిలవాలి,' అంటారు; కానీ, చిత్రంగా
అలా ప్రయత్నిస్తే మనం వారికి ఎన్నటికీ తీర్చలేని కొన్ని కోరికలు లేదా మనం
నొప్పించిన సంఘటనలు తలపుకి వచ్చి "జీవితం ఇంకొక అవకాశమిస్తే మరొకలా
జరిగేది, సరిదిద్దుకునేవారం," అనుకుంటాము. ఎన్ని వీలునామాలు రాసుకున్నా
విడమరచలేని కొన్ని మానసికమైన లెక్కలు మిగిలే ఉన్నాయి అని తేల్చుకోవాలో,
తెలుసుకోవాలో తెలియని వ్యధలో కొట్టుమిట్టాడుతాము...
కానీ, ఆ మనస్థితి రావటానికి ఆ బాధ, ఆ విడివడిపోవటం ముందుగా సంభవించాల్సిన షరతులు. అందుకే ఎవరినైనా ఏదైనా అనే ముందు లేదా ఒక చర్య జరిపే ముందు ఈ సత్యం అంతః చేతన లో ఉంచుకొనే సాధన చేయాలి అని మాత్రం అవగతమౌతుంది.

No comments:
Post a Comment