అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి-
చావిట్లో
ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు
పెరట్లో
చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు
వసాట్లో
వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు
"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు
వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ
అలవోకగా మనసు తలుపు తెరిచి
గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ మరిన్ని గోచరమౌతూ
కలగా ముగిసినవో
కథలై మిగిలినవో
కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!
"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds"
కావచ్చు...
అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...
చావిట్లో
ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు
పెరట్లో
చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు
వసాట్లో
వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు
"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు
వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ
అలవోకగా మనసు తలుపు తెరిచి
గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ మరిన్ని గోచరమౌతూ
కలగా ముగిసినవో
కథలై మిగిలినవో
కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!
"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds"
కావచ్చు...
అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...
అనుభవాలు, జ్ఞాపకాలు మన ముందు జీవితానికి చాలా ఉపయోగపడతాయి కదా..
ReplyDeleteGurthukosthunnayi
ReplyDeleteదృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...
ReplyDeletememoirs of a traveller of life ...
మీ ముగ్గురి వ్యాఖ్యలకు నెనర్లు! ఇక్కడ వర్ణించిన గృహం లో నేను వసించిన సమయం కన్నా అందులో దర్శించిన జీవన గాఢత అధికం. వెలుపలి దృశ్య చిత్రం మారుతూ ఉంది (కొంత బాదామయంగా)- కానీ, అనుభవాల వలన- మనసున వనాలు ఏపుగానే ఎదుగుతున్నాయి. జ్ఞాపకాల కట్టడాలు లేచే అనుభవాలకి విత్తులు మారుతూ, జీవన సౌందర్య మార్మికతకు ఇంకా దాసోహం చేస్తూనే ఉన్నాయి...
ReplyDeleteA review of this poem in "ఈ వారం కవిస్వరం" a column of వన్ ఇండియా » తెలుగు » సాహితి » కవిత
ReplyDeleteat: http://telugu.oneindia.in/sahiti/kavitha/kavisangamam-poet-usha-rani-internal-eye-143103.html
Thanks to the editor Sri Pratapreddy Kasula, Editor at One India Telugu.