"ఎద చుట్టూ అదృశ్యం గా అలుముకున్న ఆవరణ
మునుపెన్నడూ ఎరుగని ఆఘ్రాణింపు తో కవ్విస్తుంది
అక్షరాలు ఊపిరి పోసుకుంటూ నన్ను పీల్చుకుంటాయి
వ్యక్తానువ్యక్తంగా వేయి ఆవరణలు
వేచి ఉన్నాయి కల/పు/వేటు దూరాన"
మరువపు మైత్రి వనవాసులకు,
ఈ ఏడాది సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యశీలి అయిన మా నాన్న గారికి అనురాగ పురస్కారం గా - తనకి అంకితమిచ్చిన - 'మరువం' కవితా సంకలనం ఈ నెల ఏకాదశి కి ఆయన చేతుల మీద గా విడుదల అయింది. ఈ ఆనంద ఘడియల్లో నన్నెరిగిన మిత్రులను, అభిమానించే వ్యక్తులను కలవాలని అభిలషిస్తున్నాను.
ఈ నెల 13 (08/13/13) కి హైదరాబాదు లో విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4:30కి సమావేశమై, స్వల్ప సంభాషణ అనంతరం 6:30-7:00కి విందు. ఈ వేడుకకి రాదలిచిన వారు నా స్నేహితురాలు జ్యోతి, jyothivalaboju యట్ gmail డాట్ com కి సమాధానం (08/11/13 లోగా ) పంపితే ఇతర వివరాలు అందిస్తాము. నేను ప్రయాణం నడుమ ఉన్నందున తను నా తరఫున సహాయం ఇస్తుంది.
ఎవరెవర్ని కలవగలనా అన్న కుతూహలం, ఇదంతా అతి త్వరలోనే అన్న సంతోషం తో ఎదురుచూస్తూ,
మీ మరువం ఉష.
WOW.. Great news.. Congratulations ఉష గారూ.. ఇంత
ReplyDeleteచక్కటి సంతోషకరమైన సందర్భంలో కలిసే అవకాశం నాకు లేకపోయినా మీ పర్యటన, పుస్తావిష్కరణ గొప్పగా జరిగి మీకు బోలెడన్ని ఆనందాను భూతులని పంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అభినందనలు
ReplyDeleteHearty Congratulations Usharani garu. I am happy that you brought out your collection of poems on a great occasion. My respects to your father.
ReplyDeletewith best wishes
Hearty welcome to Mother land Dear Usha.ఈ యాత్ర మీకు దివ్య భవ్య స్మృతులు మిగిల్చాలని ఆకాంక్షిస్తూ ... శ్రేయోభిలాషి. నూతక్కి రాఘవేంద్ర రావు (కనకాంబరం)
ReplyDeleteచాలా సంతోషం అమ్మా ఉషా!
ReplyDeletehrudayapurvaka abhinandanalu Usha garu.. Heaty welcome to Motherland..
ReplyDeleteమరువపు మొలకకు మాతృభూమికి సుస్వాగతం....
ReplyDeleteవావ్.. అభినందనలు ఉషగారు, కవర్ పేజ్ డిజైన్ చాలాబాగుంది. పుస్తకావిష్కరణ దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.
ReplyDeleteమాతృభూమికి గొని మరువంపు పరిమళాల్
ReplyDeleteవచ్చు సోదరి కిదె స్వాగతమ్ము!
నవ్య కావ్య ప్రచురణమ్ము సల్పిన మీకు
అందజేయుదు నభినందనములు!
అభినందనలు ఉష గారూ! I am missing it. మొన్ననే హైదరాబాదునుండి వచ్చాను.. ఒక్క రెండు రోజులు ముందు తెలిసినా మీ కార్యక్రమం కోసం ఆగిపోయి ఉండేదాన్ని.
ReplyDeleteAll the best and hearty wishes.
అభినందనలు ఉషగారు,
ReplyDeleteకవర్ పేజ్ డిజైన్ చాలా బాగుంది. అన్ని పుస్తక విక్రయశాలల్లో దొరుకుతుందా?
అభినందనలు ఉషగారూ, పర్సనల్ పనులతో కొంచం బిజీ గా ఉండటం ఓ కారణమైతే, వేదిక నేనుండే ప్రాంతానికి చాలా దూరమూ నాకు తెలియని ప్రదేశమూ కనుక మిమ్మలను కలవలేకపోయాను:(( సారీ:(( మిమ్మలను కలిసే మరోక అవకాశం కోసం ఎదురు చూస్తుంటాను:))
ReplyDeleteమిత్రులందరి అభిమానపూర్వక స్పందనకి ధన్యవాదాలు. విందు కి వచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు, ఎంతో తృప్తి నిచ్చాయా క్షణాలు. @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు, పుస్తకం నవోదయ వారి విక్రయశాలల్లో దొరుకుతుందండి.
ReplyDelete