బాలానందం - బ్రహ్మానందం

మరువం - ఎవరం మరవగలం? ఆ చిన్నప్పటి ఆటపాటలు. పాలబువ్వ కూరేస్తూ అమ్మ పాడిన పాటలు. చిన్న మావయ్యో, పెద్దత్తో ఆడించిన ఆటలు. ఆటల తగవులు. తప్పుకొక మొట్టికాయ తో తాతయ్యో/నాన్నారో అలవాటు చేసిన దినపత్రికల పఠనం, పద్యాల వల్లింపు. పాఠశాల ఊసులు. గోడకుర్చీ వేసిన బిక్కమొహాలు. అమ్మమ్మ చేతి వంటలు. పండుగ వేడుకలు. కొత్త బట్టల మురిపాలు. ఆకతాయి అల్లరులు. వచ్చీ రాని ఎక్కాలు. వెక్కిళ్ళతో ఎకసెక్కాలు.

అసలు తెలుగు నేర్చుకున్నదలాగే కాదూ? ఆ తర్వాతేగా అయ్యోర్లు, పంతుళ్ళు...పుస్తకాలు...అవధానాలు, అష్టపదులు. ;)

సరే ఇంత ఉపోద్ఘాతం ఎందుకూ అంటే మరందుకే - తెలుగు నేర్పేందుకు. సాంప్రదాయం, సంస్కృతి గూర్చి నేర్చినవీ, నేర్పాల్సినవీ తిరగదోడుకుని, మీచేత అక్షంతలు వగైరాలతో పాటుగా మరిన్ని పాఠాలు రాబట్టుకునేందుకు.

మా మరో బాలానందానికి స్వాగతం.

మా తెలుగుబడి మొదలై రెండేళ్ళు కావస్తుంది. నా తెలుగుబడి పిల్లలకి ప్రోత్సాహంగాను, విషయ సమాచారాలు ప్రోగు చేయటానికిను, మా జన్యా విద్యా సేవా సంస్థ విశేషాలు - ఇలా కలగూరగంప కబుర్లకి ఒక వేదిక అవసరపడింది. అందుమూలాన ఈ బ్లాగు మొదలుపెట్టాను.

నా బుడతలిరిగో...అమ్మో, అల్లరి పిడుగులు సుమా!





పాఠాలతో పాటుగా ఆటలు యమజోరుగా ఆడేస్తూ...





మాతో పాటుగా మా ఆటపాటలు, పాఠశాల కళలు మీవీ అనుకుని వస్తూ ఉండండి. కబుర్లు విన్నా, చెప్పినా మీ ఇష్టం.

బాలానందం బ్రహ్మానందం
భాషాభిమానం గడ్డపెరుగన్నం
బ్లాగరుచందం పూసమిఠాయిపొట్లం
ఆడేవారూ రారండోయ్
చూసేవారూ రారండోయ్
రాసేవారూ రారండోయ్

18 comments:

  1. That's really really great!
    Iam very very happy to see you here..

    Welcome once again..!!

    ReplyDelete
  2. కలిసేవారూ రారండోయ్
    కబుర్లపొట్లం తేరండోయ్..
    అహహహ..
    బలే బాగుంది.
    తాయిలాలేమున్నాయో....?

    ReplyDelete
  3. అభినందనలండీ.....

    ReplyDelete
  4. చాలా ఆనందంగా ఉంది మళ్ళా మిమ్మల్నిక్కడ చూస్తున్నందుకు...

    ReplyDelete
  5. అభినందనలండి

    ReplyDelete
  6. అభినందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. చిన్నతనపు మాయ ఏమిటంటే ఓసారి ఆ జ్ఞాపకాల్లోకి పోతే అంతా బాలలమే, మిగిలేది బ్రహ్మానందమే. కొత్తవేవో రాసేయాలని కాదు, ఉన్న సమాచారాన్ని పోగేసుకుని, కొన్నిటిని ఇక్కడ పొందుపరుచుకుని ఒక రెఫరెన్స్ బ్లాగ్ గా మార్చాలి, పిల్లల ఊసులు భద్రపరచాలి - అదీ సంగతి.

    ReplyDelete
  7. హమ్మయ్య. ఇలా మా అందరినీ వదిలి వెళ్ళిపోయారన్న దిగులు ఇప్పటికి తీరింది ఉషగారు. ఎన్నాళ్ళకు మళ్ళీ జన్య విశేషాలు.

    హార్థిక స్వాగతాంజలి మీకు...

    ReplyDelete
  8. @వర్మ గారు, మీ అభిమానానికి సంతోషం. వెళ్ళలేదని గుర్తు చేసినా సరే ఇలానా నింద? ;) కౌటిల్య గారూ కాస్త అలానే అన్నారేమో!
    @వంశీ గారు, మధుర - ధన్యవాదాలు.

    ReplyDelete
  9. వంశీ, థాంక్యూ. గుర్తుగా వచ్చి చెప్పినందుకు. నా ఉగాది పోస్ట్ కి ఇంకాస్త సమాచారం ఇవ్వగలరేమో చూడండి (చూసారా అడుగేస్తే అంటుకుపోతాయి పంతులమ్మ పనులు). :)

    ReplyDelete
  10. Usha,
    I just googled your name and got hold of your blog site. I am so proud of you my friend.
    Naaku kalaposana lekunna, unnavallanu support cheyali. You are giving punarjanma to "Telugu".
    I am feeling bad for not donating to "Janya" when we met last weekend. I will send my donation right away. I wil introduce this site to my friends who love to read telugu saahityam.

    nee chinna naati snehituralu
    Suneeta,
    PA

    ReplyDelete
  11. మీ తోటలోని పువ్వులను,మీ బడి పిల్లలలోని నవ్వుల్నీ మీ అబిరుచుల్ని ,మీ సేవలను చూసినతర్వాత ఇక వ్రాయకుండా ఉండలేక పోయాను.నాది మీ వృత్తే .మీ బడి ప్రయోగం అభినందనీయం .నేనేమయినా మీ బడికి ఉపయోగపడతానేమో ఆలోచిస్తా మీ ఫొటోస్ అన్ని అద్భుతం .మీ బడి మీకు మరింత ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ

    ReplyDelete
  12. రవిశేఖర్ గారు, ధన్యవాదాలు. నేను వృత్తిరీత్యా టీచర్ని కాను. నా మాటలు, కథలకి ఒళ్ళో కూర్చుని పిల్లది, వీపున ఊగుతూనో, అటూ ఇటూ తిరుగుతూనో "ఊ" కొట్టే పిల్లాడు ఇంకాస్త ఎదిగాక వచ్చిన ఆలోచన ఈ "బడి" మాస్టారు. ఈ మూడేళ్ళ అనుభవాలు ఒక చిన్న పోస్ట్ గా రాస్తాను. మీ సహాయసహకారాలు సదా అభిలషణీయం.

    ReplyDelete