ఈ దేశం నాకేమిచ్చింది? నేను ఈ దేశానికేమిచ్చాను?




ప్రవాసదేశం లేదూ నా కర్మభూమి, నేను మెట్టిన స్థానం ఎన్ని రకాలుగా పిలిచినా ఈ అమెరికానే, నా మనుగడకి మార్గాన్నిచ్చిన ఈ గడ్డనే. ఈ దేశం నాకేమిచ్చింది? అన్న ఆలోచన నిత్యం ద్వైదీ భావాల్లో ముంచి తేలుస్తుంది. సుఖమా? సౌఖ్యమా? భయమా? దిగులా? ఇక్కడి వార్తలో, సమకాలీన సమస్యలో ఎత్తి రాయటం కాదు నా అభిమతం, ఇదీ ఓ స్వగతమేనేమో!

అసలీ
వేగవంతమైన జీవితాల్లో ఓ పరి ఆగి ఈ ప్రశ్న వేసుకుని సమాధానాల ఆప్షన్స్ బేరీజు వేసుకునే అవకాశముందా? నాకు తప్పా ఇంకెవరికైనా వారికి విసుగుదల కలగకుండా వేయగలనా? అలా అసహనం చూపేవారినీ, జీవితం పట్ల నిర్లక్ష్య వైఖరితోనో, బాధ్యతారహితంగానో నడిచేవారినో కాలర్ పట్టి నిలదీయగలనా..డైగ్రెస్ అయ్యాను...మళ్ళీ అసలు మాట లోకి వెళ్తూ..


దేశం నాకేమిచ్చింది? అయినా అలాగే ఎందుకు వేసుకోవాలి ప్రశ్న. నేను ఈ దేశానికి ఏమిచ్చాను? అని ఎందుకు కాకూడదు. సరే మొదటిది ఎత్తుకుందాం.


దైనందిన జీవితంలో సౌఖ్యాన్ని, స్వేఛ్ఛావాయువుల ఊపిరిని ఇచ్చింది. ఉద్యోగాల్లోని తీరు ఆధారంగా భావి పట్ల అభద్రత చవి చూపింది. I am not loyal to you, you are not loyal to me అన్న నిష్టూరాన్ని మోయమని మీద పడవేసింది. You didn't ask; I did not tell you అనే సత్యాన్ని కొన్నిసార్లు ప్రియభాషణంగా మరి కొన్నిసార్లు మాట కోసం తపించిపోయేలా చేసింది. అక్షర ప్రాతిపదికగా అమిరే అనుబంధాలని రుచి చూపి, మనసారా మనసు తలుపు తెరిచాక, అవి అందించి వెళ్ళిన వేదన కానుకలని లెక్కించుకొమ్మంది.

ప్రకృతి
పరమైన ఋతువుల అందాన్ని హృద్యంగా మీదకి రువ్వుతుంది. వైవిధ్యభరిత వాతావరణాలు, ఆటలు పాటలు క్రీడలు అవకాశాలు ఆవలీలగా అందించి స్వర్గధామాలకు తీసుకుపోతుంది. ఆహార పద్దతులు, రుచుల సమ్మిళీతాల తారంగాలు కట్టిస్తుంది.


జీవిత
కాలాల వృద్దాప్యపు దశని, అవసానదశలో బాధాకరక్షణాలనీ వార్తల్లో, వీధుల్లో చూపి బెదరగొట్టింది. మనుషుల్లో అంటురోగంలా పాకుతున్న యాంత్రికత్వాన్ని చూపి వణికేలా చేసింది. ధనవ్యామోహంలో బాంధవ్యాలు వీగిపోగలవని ఋజువు చేసింది. మనిషి మౌలికంగా ఒంటరని ఎక్కువగా గుర్తు చేసింది. స్వేఛ్ఛలోని పరిమితిని ఎత్తిచూపింది.


ఇన్ని
మంచిచెడుల మధ్య ఇంకేదో ఇస్తూనే ఉంది, ఇంకా దాచిపెట్టినట్లు ఊరిస్తోంది. వద్దని కావాలనిపించే, కాదని కాకతప్పదనిపించే ఏదో..అవకాశాలా, ఆశాద్వారాలా. పొలిమేర దాటలేవని కవ్విస్తుంది. పిల్లల భావికి తెలియని భరోసా ఇస్తోంది. స్త్రీగా సామాజిక స్థాయిలో అసమానతని దరిచేరనీయక విశ్వాసంగా అడుగేసేలా చేసింది.


వదిలి
వెళ్లగలనా? ఉండి ఇష్టపడగలనా? నా మూలాల విలువలు నా తర్వాతి తరానికి ఇవ్వగలనా? రోజురోజుకి వాళ్ళలో చొచ్చుకుపోతున్న ఈ సంస్కృతి ఏదో శాతానికి కుదించి, మాటల్లో, మాధ్యమాల్లో కనపడే నా సాంప్రదాయాన్ని వారిలో సాగుచేయగలనా? దేన్ని పరిరక్షించగలను? ఎన్ని పదిలపరచగలను? కాలానికి ఎక్కుపెట్టి వదిలిన ఈ బాణాలు వాటి గురి, లక్ష్యం అవే చూసుకుంటాయిలే అని నమ్మిక తో రేపులోకి ఎప్పటిలానే అడుగేస్తూ..

* * * * * * * * * * * * * * * * * * * * * * *


ఇక
రెండో ప్రశ్న - ఈ దేశానికి నేను ఏమి ఇచ్చాను?

నా వృత్తిపర బాధ్యతగా నా మెదడుని, మేధని ఇస్తున్నాను. నిజాయితీగా నా సాంకేతిక నైపుణ్యాన్ని ధారబోస్తున్నాను.

విరాళాలు
అడిగిన ఏ సంస్థకైనా తగు ఋజువు చూపితే నేను సహాయపడనిది లేదు.. స్కూల్స్, సంస్థలు [ప్రకృతి వైపరీత్యాలు, క్షతగాత్రులు, జీవనోపాధి, యుద్దసైనికుల నిధి ఇలా దాదాపుగా పదింటికి], ఇక్కడి నుంచి విదేశాల్లో సేవలు ఇచ్చే సంస్థలకీను [అవొక ఐదు లెక్క].

మన కుటుంబ విలువలు, సాంప్రదాయాలు జిజ్ఞాసతో అడిగే విదేశీయులకి అందిస్తాను. వీళ్ళలో మన పట్ల సదవగాహన రావాలని ప్రయత్నిస్తాను. దేశం నాది కాకపోయినా నాదన్న భావనతోనే ఇక్కడ ప్రశాంత వాతావరణానికి నా వంతు కృషి చేస్తాను. ఒక మనిషిగా నేను చేస్తున్నా ఇవి చాలా వరకు సమిష్టి కృషిలో భాగాలు. ఏదో ఒక ప్రయోజనానికి హేతువులూను. ఇది చాలదా? ఈ దేశానికి నేను ఇవ్వగలది ఇంకేముంది.


Every year as a donor I receive a compliment pack with my address stickers and a card from the Disabled American Veterans Association. Just sharing the poem, Forget-me-not, from this year's Memorial Day card observed "In honor of the soldiers who have given their lives for our country".

Forget-me-not
When you're lost in thought
As you make it through your day

Forget-me-not
I am one who fought
And was scarred along the way

Forget-me-not
For the freedom bought
With the lives one can't repay

Forget-me-not
When ever your child is taught
To remember yesterday

Forget-me-not
When the day is hot
And you bend your knees to pray

Forget-me-not
Yes, I heard the shot
But I did not run away

Forget-me-not
I'm a patriot
And I need your help today

***************************************
A part of reader in me longs for works like this, Ancient India's Contribution to Our World's Material (Temporal) Culture - http://hindutva.org/sudheer_birodkar/india_contribution/

After the 911 incident, when people are sending in messages..I quoted the below from this book.. I am not in to religion as a means to hate others. Later I found out that , This book is apparently used as a reference for History in High School.

"Here goes a Sloka (couplet) from the Atharva Veda (one of the 4 Vedas - treatises on knowledge from ancient India)
which embodies the true spirit of humanness expressed, not today, but four thousand years ago.


We are the birds of the same nest,
We may wear different skins,
We may speak different languages,
We may believe in different religions,
We may belong to different cultures,

Yet we share the same home - OUR EARTH.

Born on the same planet
Covered by the same skies
Gazing at the same stars
Breathing the same air
We must learn to happily progress together
Or miserably perish together,
For man can live individually,
But can survive only collectively"




దశాబ్ద
సుమారు ఈ ప్రవాసంలో కొన్ని ఘట్టాలు/మైలురాళ్ళు:



2000



అమెరికా
రావటానికి నిర్ణయం.. సిడ్నీలో సుమారు వంద కుటుంబాలతో పరిచయం. "ఎందుకు అమెరికాకి వెళుతున్నారు?" అన్న సన్నిహితుల ప్రశ్నకి, ముందుగా నవ్వు సమాధానం "వేచి చూడండి" అన్న మాకే స్పష్టత లేని, దానికి లేని బలాన్ని అద్దుతూ అప్పటికి తప్పుకున్నా ఇప్పటికీ అదే స్థితి. అసలు కన్నభూమి వదిలాక ఏ కర్మభూమి మేలు? మునుపటివారికి రెక్కాడాలి, మనకి మెదడు అరగాలి - అదీ సూత్రం.


2001



వచ్చి ఏడాదన్నా కాలేదు. ఇంకా నికరమైన పరిచయాలు లేవు. సెప్టెంబర్ పదకుండు ఘటన తర్వాత మూడో రోజుకి పిల్లాడి స్కూల్ నుంచి ఫోన్, కళ్ళు తిరిగి పడిపోయాడని. ఉరుకులు పరుగులు గా వెళితే, నీలో బిన్ లాడెన్ పోలికలున్నాయని వెనక నుంచి తల మీద ఇద్దరు పిల్లలు గట్టిగా మోదితే బిడ్డ అలా.. ప్చ్.. భయం గుప్పిట బతికినట్లు. తిరిగి వాడు వాలంటీర్ గా దెబ్బతిన్న కుటుంబాల సహాయార్థం విరాళాలు పోగేసి, లోకల్ హీరోస్ గుర్తింపు పొందినపుడు సంతృప్తి. పిన్న వయసులో కష్టసుఖాలు అవగాహనకి వస్తున్నాయిలే అని.

2002



ఆరోగ్యం, వ్యాయామం పట్ల నామకహా శ్రద్దలోకి జీవితం దిగబడిపోతున్నప్పుడు రెండు హిప్ బోన్స్ రీప్లేస్ అయినా శ్రద్దగా వర్కవుట్, నృత్య సాధన చేసే స్నేహితురాలు దొరకటం. ఆ ప్రభావాన తిరిగి కళాశాల నాటి వైభవం జీవితంలో తొంగి చూడటం. అలా అలా మారథాన్ పరుగులు, శాస్త్రీయ నృత్య ప్రదర్శన జీవితంలో సంభవించటం.

2003


"ఇల్లు కట్టి చూడు" అనుభవం లోకి వచ్చేసింది. భూమి పూజ అయిన ఆర్నెల్ల లోపే స్వంత ఇల్లు. ఆ ఏడాదే ఇండియా ప్రయాణం. మోసం చేసి టికట్స్ డబ్బు వాడేసిన ట్రావెల్ ఏజంట్ చేతిలో నావి ఆరు వేలు పోతే అసలు మొత్తం రెండువందల యాభై వేలు మోసగించాడు. మన దేశస్తుడు. ప్రవాసజీవితాల సాధక బాధలు ఎరిగినవాడు. మరి, అన్ని తెలిసీ ఎందుకీ మోసాలు? ధనం, మూలం, మిదం, జగత్ కాబోలు.

2004




పిల్లదానికి
అమెరికా సేవాతత్పరత పరిచయం చేయగల గర్ల్ స్కౌట్స్ అనుభవం. ఐదేళ్ల వయసులోనూ వారికి తగ్గ పనులు వారూ చేసారీ చిన్నారులు.



2005



ఇక్కడ ఉన్నా మనసెప్పుడూ అక్కడే. "ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా సొంతవారు ఐనవారు అంతరాల ఉందురోయ్ . ..." మొదటిసారి మా మేనమావయ్య నా స్వంత ఇంటికి రావటం. ఆ దంపతుల యాభయ్యవ వివాహదినోత్సవ వేడుక నేను చేయటం.. ఈనాటికీ మావయ్య ఆ మాటలు వస్తే ఆనందంగా గుర్తు చేసుకుంటారు.

2006





ఏ స్వలాభాపేక్షకీ తలనీలాలు ఇవ్వని నాకు, ఒక సదుద్దేశ్యంతో ఆ స్థాయి పుణ్యాన్ని, దాదాపు త్యాగసమానం [నాతో ముప్పై యేళ్ల పైగా ఉన్న కురులు ఇచ్చేయటం అంతేగా!] Locks of Love కి జుట్టు ఇచ్చేసా. నా కారణంగా కాకపోయినా ఆ సమయాన ఒక స్ఫూర్తి కలిగి మరొక ముగ్గురు కూడా ఇవ్వటం ఇంకాస్త సంతృప్తినిచ్చిన పరిణామం.

2007








అసలు హైస్కూల్ దాటేవారికి గ్రాడ్యుయేషన్ చేయాలా? అది వారిలో ఉత్సుకత/బాధ్యత పెంచుతుందా? అసలు కళాశాల విద్య సముపార్జనకి ఉద్యుక్తులని చేస్తుందా. ఇప్పటికీ ఈ విషయమై భిన్నస్వరాలు ఉన్నాయి. నేను ప్రత్యక్ష్యంగా గ్రాడ్యుయేషన్ సెరెమనీ చూసాను. ఆ సమయాన మా ఊరిలోని కాప్ అండ్ గౌన్ ఫాక్టరీకి వెళ్లటం తో, ఆ సీజన్ లో ఆ కార్మికులు, ఉద్యోగుల మీద ఎంత పని వత్తిడి ఉంటుందో తెలిసింది. పైన రెండూ అక్కడ తీసిన ఫొటోలు.

2008




నాకు
స్వదేశీయానం - పిల్లలకి అదొక విదేశీయానం మాదిరిగా. గత నెల టపాలో ప్రస్తావించినదే. నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఉపాధ్యాయిని చాలా యేళ్ళకి కలిసిందీ యేడే. అమెరికా నా కలల ప్రపంచం, అక్కడ నా ప్రియ శిష్యురాలివి నీవున్నావు అంటే నాకు అమితానందం అన్న ఆ మాటలు ఈ నాటికీ పునశ్చరణ కి వస్తూనే ఉన్నాయి.


2009


విరాళాలు ద్వారాగాను, తెలిసిన మార్గాల్లోనూ సహాయపడుతూ నా ప్రియ మిత్రురాలికి అండగా మేమే మొదలు పెట్టిన సంస్థ - జన్యా.


2010




దేశం లో పిల్లలకి అన్నీ ఎక్స్పోజర్ ముందుగానే అవుతాయి..మా పాప హెయిడీ కి తనంత తన ప్రయత్నం తో మూడు వందల డాలర్స్ పోగేసి తనంత తనే రీసెర్చ్ చేసి ఉన్నంతలో రెడ్ క్రాస్ మాత్రమే మెరుగైన సేవలు, దానమిచ్చిన మొత్తానికి తగు న్యాయం చేస్తుందని వారికి ఇవ్వటం జరిగింది.

అలాగే లెమనేడ్ సేల్స్, బేక్ సేల్స్ చేసో, లేదా సరదా ప్రాజెక్ట్స్ చేసో, తన పుట్టినరోజు కానుకల సొమ్మో అలా విరాళాలుగా ఇస్తుంటే, ఇక్కడ పెరగటం వలనేనా పదకుండేళ్ళ పిల్ల అంత గా దృక్పథం ఏర్పరచుకున్నదీ అనిపిస్తుంది.
కనుక, ఈ దేశం నేను ఒకరికొకరం ఇచ్చి పుచ్చుకుంటూనే ఉన్నాము, ఇకపైనా ఉంటాము.

దేశానికి నా అభినందనలు. నా మిత్రురాలు భావన మాటల్లో మరికొన్ని ఇక్కడ.

ఈ రోజు జరిగిన ఫైర్ వర్క్స్ లో రద్దీ కారణంగా, కాస్త దూరం నుంచి తీసిన ఫొటోల్లో కాస్త మెరుగ్గా వచ్చినవివి.

చిన్ముద్రల టపాసు... :)






ఈ కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో వయో, జాతి, కుల, మత అంశాలకి అతీతంగా సుఖ శాంతుల ప్రతీకలు. అలాగే మా/స్నేహితుల పిల్లలు దీపావళి అంత సందడిగా, సంబరంగా ఇంటి దగ్గర పేల్చిన ఆనంద టపాసులివి.



"సర్వే జనా సుఖినోభవంతు"

29 comments:

  1. మీ స్వగతం బాగుంది అండి. స్ఫూర్తిదాయకంగా ఉంది.

    ReplyDelete
  2. మీ మెట్టిన దేశం స్వాతంత్ర్య దినోత్సవశుభాకాంక్షలు ! సరైన సమయంలో మీ స్వగతం బాగుంది !

    ReplyDelete
  3. మిమ్మల్ని,మీ పిల్లలను ఎలా అభినందించాలో తెలియడంలేదు.

    ReplyDelete
  4. ఎన్నోరకాల అనుభవాలతో కలబోసిన మీ ప్రవాస జీవితం మాక్కూడా ఎన్నో విషయాలను తెలియ చేసింది. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఇచ్చిపుచ్చుకుంటేనే కదా బాగుంటుంది:)

    ReplyDelete
  5. "వున్నదాని తో అసంతృప్తి లేనిదేని కోసమో తపన.....అదే మానవ జీవిత సారం "అన్న ఒక మాహాత్ముని మాట నిజమనిపిస్తోంది మీది చదివిన తర్వాత.
    మీలో ఆ గాప్ ని ఫిల్ చేయడనికేం చేయాలో ఖచిత్తం గ అలోచించి ధైర్యం గ ముందడుగు వేయండి ,అంతా మంచే జరుగుతుంది అని బావిద్దాం

    ReplyDelete
  6. ఎన్నో హృదయాల అంతస్సంఘర్షణని అందంగా వెలిగిచ్చారండి. ఎప్పుడైనా, ఎక్కడైనా ఇచ్చిపుచ్చుకోవడంలోనే జీవనమాధుర్యం ఉంది. ఆ నిజం మీ టపాలోనూ ఉంది. మీ అందరికి నా శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. సందీప్ గారు, శ్రావ్య గారు, మీ తొలివ్యాఖ్యలకి, స్వగతంలోని సత్యాన్ని చూసినందుకు దన్యవాదాలు.

    వెంకట్ గారు, మరొక సరళమైన టపా కదూ?

    హరేకృష్ణ గారు, స్పెషల్ థాంక్స్.

    ReplyDelete
  8. బాగాచెప్పేవు ఉష ఇక్కడి జీవనవిధానాల జాతర. మంచి పాయింట్ "ఈ దేశం నాకేమిచ్చింది ఈ దేశానికి నేనేమిచ్చాను." good work..

    ReplyDelete
  9. విజయమోహన్ గారు, అంతమాట అనకండి. వాళ్ళని పెరగాల్సిన రీతిలో పెంచానంతే అచ్చంగా నన్ను మా అమ్మానాన్నలు పెంచినట్లే..కాకపోతే పెరుగుతున్న వాతావరణం తేడా.

    జయ, అంతే కదా, ఇచ్చిపుచ్చుకోవటంలో మరొక సౌలభ్యం కూడా ఉంది. కొన్నాళ్ళకి పుచ్చుకోవటం అంత పెద్దదిగా తోచదు, ఇవ్వటమన్న వ్యసనంలో పడిపోతాము. :)

    ReplyDelete
  10. సావిరహే గారు, నాకే అసంతృప్తీ లేదండి. నా స్వభావమే అంత, సాధించిన దానితో ఆగలేను. దొరికినదాన్లో తృప్తినీ వెదకటం మానను. :) భావన టపా లో రాసినట్లు మేము అన్నివిధాలుగా వికసించింది ఇక్కడే, నిష్టూరమే అయినా.

    ReplyDelete
  11. AMMA ODI గారు, చాలా రోజులకి మీ వ్యాఖ్య. అంతస్సంఘర్షణ కాంచినందుకు కృతజ్ఞతలు.

    భావన, అంతేగా, నీది నాది ఒకటే ముగింపు మన టపాలకి. ఈ నేను ఏమి చేసాను/ఇచ్చాను అన్న తత్వమే ఎన్నో నిరాశల నుంచి కాపుదల కాసేది కాదా?

    ReplyDelete
  12. సావిరహే గారు, మళ్ళీ చెప్పాలనిపించి..ఈ టపా చదివినవారు నేను అధైర్యపడి ఉన్నానని అనుకోకూడదనే ఈ వివరణ..:) "AMMA ODI" చెప్పినట్లుగా నాదైన స్వగతమే అయినా నేను ఎందరినో పల్స్ చెక్ చేసాకనే రాసిన "ఎన్నో హృదయాల అంతస్సంఘర్షణ" వంటిది ఇది + ఇచ్చి పుచ్చుకోవటంలోని రాగ సుధా భరిత జీవనాన్ని తలపోసుకోవటమూను. మీరు తప్పక మా చేత ఇలా ఆలోచించే అవకాశాలు ఇవ్వాలి మీ వ్యాఖ్యల ద్వారాగా. నెనర్లు.

    ReplyDelete
  13. అమెరికాలో గడిచిన పదేళ్ళ మీ జీవనప్రయాణం గురించిన ఊసులు బాగున్నాయండి

    ReplyDelete
  14. రాధిక(నాని) గారు, యా తూర్పు వెళ్ళే రైల్లో మొదలైన జీవితం ఇలా "జీవితం సప్త సాగరతీరం.." గా మారిందని పాడేసుకుంటూ..ఈ పడమటి సంధ్యారాగాన "జీవితమే సఫలమూ… రాగసుధాభరితమూ" పాడుకుంటామిక. ధన్యవాదాలు... మూడురోజుల సెలవుతో ఇలా హాప్పీ మూడ్..

    ReplyDelete
  15. బాగుందండి........ మీ అనుభవాలు చాలా విషయాలను తెలియచేస్తున్నయి. దాదాపు చాలా మందికి ఎదురయ్యె అనుభవలు :)

    ReplyDelete
  16. ఏ దేశమేగినా ...ఎందు కాలిడినా ......
    అభినందనలు మీకుమాత్రమే కాదు మీ సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్న చిన్నారులకు కూడా .........

    ReplyDelete
  17. థాంక్స్ టూ భా.రా.రె, సావిరహే గార్లు.

    ఇష్యూ ఫిక్స్ అయినట్ల్లే ఉంది. కనుక, ఆ అభ్యర్థన టపా తొలగించాను. మీ వ్యాఖ్యలు సరదాకి ఇక్కడ పడేస్తున్నాను.

    * * * * *
    సావిరహే has left a new comment on your post "అభ్యర్థన: బ్లాగర్ వ్యాఖ్యల ఇబ్బంది!":

    maruvam vusha,
    mee post chadivina teeka taatparyaayalu memu enaadu maruvam(never forget) vusha....!

    * * * * *
    భాస్కర రామి రెడ్డి has left a new comment on your post "అభ్యర్థన: బ్లాగర్ వ్యాఖ్యల ఇబ్బంది!":

    అయితే నా కామెంట్లన్నీ హుష్ కాకీ అయ్యాయా?
    * * * * *
    ప్రణీత, ఓసారి చెక్ చేసుకోండి. నాకు పోయింది ఇష్యూ మరి! నెనర్లు.

    ReplyDelete
  18. ఒకరినుంచి ఒకరికి
    ఒక తరం నుంచి మరొక తరానికి
    మంచి మంచి పనులు చేసే
    మనసులోన మంచి పెంచే
    అందమైన అనుభవాలు
    అందంగా దండలల్లి
    మల్లి, జాజి, చేమంతి
    మరువపు తావులతో
    తళుకుల మెరుపుల చెమ్కీ
    ధగధగల వెలుగుతో
    మనసునూ, మనిషినీ కూడా
    కదిలించే కధనంతో
    ఎంతో హృద్యంగా తెలిపిన
    స్వతంత్ర కోకిలా
    జోహార్.. జోహార్..జోహార్...

    ReplyDelete
    Replies
    1. మీ అభినందన సుమధురం, శ్రీలలిత గారు.

      Delete
  19. లలిత గారు,

    మీ పదాలలో ఓలలాడి, ఊయలూగి ధన్యత చెందానండి.. కానీ మనిషిని మనిషి పనులు చేస్తే ఇన్ని అంటారా ఎవరైనా? :) మీబోటివారి దీవెనలే మాకు శ్రీరామ రక్ష. మిమ్మల్ని అలరించగలిగినందుకు, ముఖ్యంగా ఆ మధ్య నవ్యలో వచ్చిన మీ కథ రీత్యా..స్ఫూర్తి వెదుక్కోవాలే గానీ కొలనులో ఏ లోకం ఎరుగని చేప కూడా ఈదులాడటం చూపి ఉత్తేజపరుస్తుంది. నా కథలు, కథనాలు, కవితలు ఒకరిని చూసి ప్రేరణ పొందేవీ లేదూ మరొకరికి ఏదో అనుభవం నేను పంచేవీను.

    కృతజ్ఞతలతో,
    ఉష.

    ReplyDelete
  20. ఉష!yet we share the same home - OUR EARTH. ఈ వాఖ్యలు నిష్టుర సత్యం . విశ్వాసాలేవైనా మనుగడనిస్తున్నది ఈ పుడమే నన్న వాస్తవాన్ని మనిషి మరుస్తున్నాడు.
    నీ జీవన యానంలోని ,ప్రవాస జీవిత అనుభవాలు , వాటిని చెప్పిన తీరు, చాల గొప్పగా చక్కగా వుంది. భావనలు, నిక్కచ్చిగా వ్యక్తపరిచి న నీవు ,పుట్టిన గడ్డపైన నీ మమకారాన్నివ్యక్తపరుస్తూనే ,మనుగడ నిచ్చిన గడ్డ పై ప్రతి వక్కరికీ ఉండవలసిన కనీస భాధ్యతనూ,ఆక్కడి మంచీ, చేడులనూ ,నేర్చుకోవలసిన వాటి గురించీ, విస్మరించ వలసిన వాటి గురించీ, మాతో పంచుకున్నందుకు నిన్ను అభినందించకుండా ఉండలేను. సేవా తత్పరతలో నీ తో పాటు పిల్లలనూ నేర్పరులను చేయడం అభినందనీయం .పిల్లలకు నా హార్దిక శుభాశీస్సులు . శ్రేయోభిలాషి. నూతక్కి.... yet we share the same home - OUR EARTH.

    ReplyDelete
  21. నూతక్కి వారు, మీరిలా తొంగి చూడటం నాకు చాలా ఆనందం. మీకు తెలియనిదేముందండి - "పక్షికి ధాన్యం, పశువుకి గ్రాసం, మనిషికి సాయం" ఆనాటి మాటే ఈనాడు తగురీతిన పాటించేవారెందరో ఉన్నారు. వారిలో నేనొక సగటు మనిషిని సాధారణస్థాయి పౌరురాలిని. ఇలా పైకి చెప్పేది ప్రేరణకీ, స్ఫూర్తికీ మాత్రమే. ధన్యవాదాలు.

    ReplyDelete
  22. ee saari mee blaaguku koddigaa laeTugaa vachchaanu. As usual chaalaa chaalaa baagundi.

    ReplyDelete
  23. థాంక్స్ సునిత..ఇక మన డవిలాగ్ [ఎప్పుడు వచ్చారన్నది కాదు సిస్, కామెంటారా లేదా అన్నది కొచ్చన్] ;) అన్నిటికన్నా బెస్ట్ వ్యాఖ్య..ఇదేదో ప్రివ్యూలా ఉంది.ఇంకా రాయాల్సింది అని. ఇప్పటికే ఇది తడిసి మోపెడు, సాగదీసానని అనుమానం. నెనర్లు.

    ReplyDelete
  24. ప్రియ, ఎన్నాళ్ళికివే అమ్మాయ్! నీ మానసపుత్రిక "జన్యా" మాట ఎత్తగానే దిగివచ్చావా నెచ్చెలీ? థాంక్స్.

    ReplyDelete
  25. నెనర్లు. ఆలస్యమే నాదీనూ, కానీ తప్పిపోనందుకు సంతోషిస్తున్నాను.ఓ గొప్ప యాత్ర! బాధ్యతా, మానవీయతా జమిలిగా సాగిన/సాగే యాత్ర! ధన్యవాదాలు.

    ReplyDelete