దంతసిరి

1.
ఇంటి వంట ఒంటబట్టగ
పంటి పదునుకి సొంటి ఘాటులు।
పట్టి దినుసుల గట్టి  రుచులను
పట్టు పట్టగ పెట్టి పుట్టవలె।।

సురేష్ కొలిచాల గారు సూచించిన మార్పు తో
2.
ఇంటి వంటలు ఒంట బట్టగ
పంటి పదునుకి సొంటి ఘాటులు ।
పట్టి దినుసుల గట్టి రుచులను
పట్టు పట్టగ పెట్టి పుట్టెను ।।

4 comments:

  1. కంటే ఆశ్వాదింపగ
    నింటను గట్టి దినుసుల తనివితీర రుచుల్
    ఒంటికి బట్టను వండగ
    పంటి పదును జూచె ఘాటు సొంఠి మరువమా!



    జిలేబి

    ReplyDelete
  2. జిలేబీ గారు, నెనర్లు. నేను సరదాగా మా అమ్మాయి చేత చదివించటానికి వ్రాసాను (ఏ భాషా నియమాలు పాటించకుండా). మీరు తప్పక ఛందస్సు ననుసరించి వ్రాసి ఉంటారు.

    ReplyDelete
  3. మేడం గారూ, ఇవి నా కొంటె ముచ్చట్లు ...
    (ఛందస్సుకు నాకు చుక్కెదురని
    గమనించ ప్రార్ధన)

    వంట దినుసులు శొంఠి ఘాటులు
    పంట అదమగ గంటు కుదిరెను
    ఇంటి వంటలు తింటి ముదమున
    ఒంట బట్టగ అంటి రసములు

    ఇంటి వంటలు ఒంట బట్టెను
    అంటి అదునుగ శొంఠి ఘాటులు
    వంట దినుసులు పంట కుదరగ
    గంటు పెట్టుచు తింటి ముదమున

    ::))

    ReplyDelete