Showing posts with label చిత్రశీర్షిక. Show all posts
Showing posts with label చిత్రశీర్షిక. Show all posts
ఉదయాన్నే- ఒకానొక ఉద్భవం!
మేఘపు మెరుపు రూపు మారుతుంటేనే ఈ బింబపు ఆకృతి ఊహామాత్రం గా తోస్తుంది కదా!? ఇప్పుడు నేను మేఘాన్ని చూస్తున్నానా..భ్రమణం తో నా చూపు ఆవరణ మార్చే మౌనమూర్తి భూమి ని కాంచానా..నిశ్చలంగా నిలిచినా కర్మసాక్షిని దర్శిస్తున్నానా..ప్రతి ఉదయం లో నాలోని ఒక నేను ఉద్భవిస్తూ వస్తున్నానని మాత్రం తెలుసుకున్నాను...!
(సప్త అశ్వాల సాక్షి గా కొన్ని ఉదయాల పయనాలు ఈ చిత్రమాల తో సమాప్తం, అందరికీ నెనర్లు!)
విత్తుల పొత్తు విస్ఫోటం
విత్తులు వెదజల్లటమనే ప్రక్రియతో ఆకట్టుకునే ఈ పూవు పేరు డాండలయన్... గాలిగుమ్మటపు తీరుతో ఎగిసిపోతూ ఈ విత్తనాలు ఎటెటో సాగుతాయి, ఒక మెత్తని గోరువెచ్చని తడి నేల వెదుక్కుని దాగిపోతాయి, వసంతం వేళకి మొలకెత్తి పసిడి వన్నెల పూలతో మైమరిపిస్తాయి...ఎప్పుడు మొగ్గ తొడిగాయో నివ్వెరపోయిన నన్ను చూసి రవ్వంత పరిహాసం కలిపిన పరిచితమైన చనువుతో పిలిచాయి ఓ నెల క్రితం రంగులే పేరుగా రేకలుతోనే రూపురేఖలైన విరులు ఎన్నెన్నో, అందులో త్వరపడి మరుజన్మకి 'మాయ' దారి పరుచుకుంటూ-
Best of Nature's Craft!
(Canon Powershot SD600 - Jan 2010, My village and land, India)
ఆకు తెప్పలపై గాలి కెరటాల మీద సోకు పోతున్న సీతాకోక నైతే- ఎంతో బాగుంటుంది...
ఆకు తెప్పలపై గాలి కెరటాల మీద సోకు పోతున్న సీతాకోక నైతే- ఎంతో బాగుంటుంది...
The beauty lies in the camouflage of the leaf and petal... The winds cut the leaf edges and the shades of grass from underneath forms waves and they match with the pattern on the wings. The best craft and art of Nature!
వ్యాఖ్యల హారం!
1 చిగురాకు నిచ్చెనలెక్కి చెలియ చూపు నిను చేరేనోయీ, ఓ సఖా
2 పక్షి: నేను సైతం చివురాకునై కొమ్మన ఊగుతా
ఆకులు: మేము సైతం రెక్కలు గట్టుకు రివ్వున ఎగురుతాము
3 వియతికెన్ని ఊహలో _ పత్ర మంజూషాన్ని గాంధర్వంగా మలిచెయ్యాలని...!
4 కాలమో పిల్లనగ్రోవి _ శిశిరాన్ని దాటేస్తూ వసంతాన్ని పల్లవిస్తూ...!
5 మావి చిగురు తినకున్న - పిట్ట కూత కూసింది
6 కోయిల మదిలో చిగురించే చిరు ఆశ, బదులిచ్చే చెలి చేరునని
7 కులుకుల చిలుకు తన్మయియై చిగురుదళముల పరిచి నిలిచినదెవరి కోసమో!
8 చిరుజల్లులే చిగురాకులుగా మారి వేసిన లతల అలలలో కలగా కలిసిపోతూ తోటలో మెరిసిన ఈ మౌన శకుంతం ఆలాపిస్తున్న గీతమేమిటో
9 చిగుర్లుగా పేర్చుకుంటోంది కోకిల గానాన్ని. పొందికైన రాగం.
10 చిగురించే తోటలోకి కోకిలొకటి వచ్చిందీ
11 రేపటి కోసం ఇవ్వల్టి ఎదురుచూపు! 'waiting'
12 చిగురంత ఆశ తో... ఆకాశమంత ఎదురు చూపుతో.. నీకై వేచి వున్నా.. సఖీ..!

# మొదటి 2 వ్యాఖ్యలు నావి, తతిమావి స్నేహితులు పంచినవి
Subscribe to:
Posts (Atom)