అలాగే ప్రతి స్పందనకి మూలం ఒకటుంటుంది. బాంబే జయశ్రీ పాడిన ఈ ప్రణయ సంధ్య - మలయాళం పాట లోని మెలొడీ నన్ను వెంటాడుతూనే ఉంది. సుమారు మూడేళ్ళ క్రితం వచ్చిన ఈ పాటని గూర్చి ఆవిడ మాటల్లో "“The best song I have sung in recent times,” says Jayashri. “The song ‘Pranaya Sandhyayoru Vin Sooryan’ is a poignant melody. It haunted me for days..."
నాకు చదివి నచ్చిన కవితకి చిత్రం గీసుకోవటం అలవాటు. అందుకు వ్యతిరేకంగా నేను కొన్నేళ్ళ క్రితం గీసిన చిత్రం ఒకటి "విశ్వామిత్ర" లో వాడాను. అప్పట్లో ఆ చిత్రం మీద మంచి కవితలు వచ్చాయి. ఈ వసంత ఋతువులో ఓసారి అలా వ్యాఖ్యల్లో మిగిలిపోయిన వాటిని మీ ముందుకు తెద్దామని..మరి కొందరు ఆస్వాదించే వీలు కలిపిద్దామని..అలాగే మరెవరైనా ఇస్తే ఇక్కడ కలుపుదామనీను. నెనర్లు.
చిత్రం:
కొబ్బరిచెట్టుకి ఆనుకుని వున్న ఓ యువకుడు, నిండు పౌర్ణమి రేయిలో ఆ కొబ్బరాకుల వెనగ్గా వున్న చందమామ, ప్రక్కనున్న సన్నజాజి పందిరి ని ఆనుకుని స్వాప్నికావస్థలో వున్నట్లున్న యువతి. ఇరువురికీ నడుమ జాడలుగా పరుచుకునున్న వెన్నెల. వారిరువురి నడుమా పరుచుకునున్న ఆ కాంతి, ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తున్న అనురాగవాహినా అన్నట్లుగా వుంది.
*******************************
నా కవిత:
వెన్నెల్లో ముంచితీసిన సన్నగాలి కలాలు
కొబరాకు పత్రాలమీద నీకు లేఖలు లిఖిస్తే
చందురూడు నిన్ను కాంచి నివ్వెరపోయాడో
నీ మది దోచిన నను చూసి సంబరపడ్డాడో
సన్నజాజి వూగిసల చిరుస్వరాలు
నీ చెవి జూకాలకి సాటి అంటుంటే
నీకంటి కలల వర్ణాలు నా కలలసౌధానికి
మంచి గంధపు దూపాలు చదివిస్తుంటే
చెలియా నిను చేరిన ఈ ఇహం మరిచి
నా అహం విడిచి మళ్ళీ నీకు అర్పితమవనా?
సఖీ, నీదని నాదని ఏదీ లేదని తెలిసినదేదో,
మనది కానిదేదీ వలపు కాదనీ తెలిపినది
*************************
శ్రీలలిత
అమృతం వెన్నెల జల్లులా కురిసిన ఆ రాత్రి
వ్యక్తిత్వమే వెన్నుగా నిలబడిన ఆ మనోహరుని ఎదుట
సన్నజాజిలోని సన్నదనం, లాలిత్యం, మురిపెం, మోహం
ఆతనిని అల్లుకోవాలనే ఆశని ఒకటికి రెండింతలు చేస్తుంటే
స్త్రీ సహజసిధ్ధమైన సిగ్గు ముందుకెళ్ళడానికి మొగమాటపడితే
గ్రహించిన ఆ యువకుడు అందుకోవాలి కదా
ఆమె హృదయం లాంటి హస్తాన్ని...
ఎంత ఖేదం.. చెప్పరమ్మా మీరైనా వెన్నెల జల్లులు
ఊరుకున్నారేంటమ్మా కొబ్బరాకులు
అసలే సన్నజాజి గొంతు సన్నది
అయినా వినవలసింది హృదయాన్ని కదా...
ఇంకా ఎందుకీ వెనక ముందాటలు...
ఎంత దుర్మార్గమీ లోకం
అందరూ కన్నయ్య పక్షమేనా
ఏమిచ్చాడమ్మా మీకు
దొరికీ దొరకక ఊరించడం తప్ప...
సమయమేదీ సన్నజాజికి
తెల్లవారితె వాడిపోదా
ప్రభుని పాదాల వాలక
ధూళిలోనే కలుస్తుందా...
గొప్ప నోములే నోచిందిగా
తీవ్ర తపస్సే చేసిందిగా
ఇన్ని యేళ్ళు వేచి
ఇపుడు ఇంకా ఎదురుచూపేనా...
ప్రదీప్:
నారిని చూస్తూ నారికేళవృక్షానికి ఆనుకున్న నవయువకుడు
వెన్నెల వెలుగుల నీడలో సన్నగాలులు వీస్తూ ఆ వృక్షం
ఆ సన్నగాలికి కలయా నిజమా అని తెలియని మధురానుభూతిలో
ఎదుటపరుండిన సమ్మోహన సుందరాంగి
మన్మధుని విల్లుకైనా లొంగని అనిర్వచనీయ ప్రణయధ్యానంలో మునిగిన జంట
ఆ దృశ్యాన్ని చూచి భూమే పరవశమున మందగమనాన కదిలిందేమో
పున్నమి వెన్నెలకేనా ఈ భాగ్యమని
కన్నుకుట్టి దూసుకువచ్చే సూరీడుని ఆపే భూగమనం
ఎంతమందిని చూడలేదో ఇలాటి జంటలను ఆ పున్నమిరేడు
నారి - నారికేళం - పురుషుడు
నారి - సంద్రపుఅలలు - పురుషుడు
నారి - పర్వతశిఖరం - పురుషుడు
నారి - నదీతీరం - పురుషుడు
ప్రాంతమేదైనా, ఆ ఇరువురి నడుమ ప్రేమ పదిలమే ఆ వెన్నెల పందిరిలో
******************************************
భా.రా.రె:
నిండు పున్నమి రేపిన తాపము
యువతి మనమున రేగిన మోహము
మోహ విచలిత విరహ జవ్వని
తనువున రేగెను ఆరని మంటలు
ఆరని మంటల రేగిన జ్వలితము
వెన్నెల దారుల తోరణ మాలిక
రెప రెపలాడెడి కన్నియ మనసు
వింతగ వీచే మన్మధ గాలులు
మరువపు గాలుల చిందిన నీళ్లు (కొబ్బరి)
చిరు జల్లుల తడిసిన "విశ్వా"సము.
మన్మధిని వలలో లేడికూన చిక్కిందా
సన్నజాజి మరుల మన్మధుడు మధనపడ్డాడా?
************************************
కుండపోతగా వెన్నెల వర్షం
ReplyDeleteవాళ్ళిద్దరి మధ్య
మౌనంగా ప్రవహిస్తోంది ప్రేమ
యధాలాపపు వ్యాఖ్య అంతే
ReplyDeleteహుం ఏం చెప్పను ఉష. అన్ని మాటలతో చెప్పాలి కళ్ళతో చదవాలి అంటే కష్టం. కొన్ని భావాలు మనసుతో వూసాడితే గుండెలో లిఖింపబడతాయి, అంతఃశ్చేతనానికి అందుతుంది..మూసిన అర రెప్పల వెనుక సమాధానం లిఖింపబడుతుంది.... చేరవలసిన గుండెకు తంతి చేరనే చేరుతుంది. ఇంక ఈ జాబులేలా ఈ మాటలేల... కాలాన్నే ఈ భావాన్ని తనకు నచ్చిన రీతిన చెక్కని.... చివరకు మిగిలేది వసంతాన ఆస్వాదించే మలయ మంద మారుతమే... ఆ చిరుగాలిన వీచిన ప్రియుని తలపుల సుగంధమే. ఏం చెప్పమంటావు చెప్పు.. సరే నీ తృప్తి కోసం చెపుతాను.
ReplyDeleteకనులకు అందని ఆకృతి ప్రకృతి శోభ లో కలిసి
నీ రూపును సన్నజాజి తావితో,
నా మేనిని నిండు కొబ్బరిమానులో నింపి..
వలపు లేఖలను మేని చాయల మీద నీ కంటి చూపు ప్రేమ జాలు తో జలతారు సంతకాలు గా ముద్రిస్తుంటే...
ఒక ముద్దిస్తుంటే....
అవ్యక్తానువ్యక్తమైన నీ అనురాగమేమో వెన్నెల మొలకలేస్తోంది,
దాచిన స్వాభిమానమేమో గులాబి వెనుక దాగిన నల్లని ముల్లు లా గుచ్చుతోంది....
వో చెలి... అహమా కాదు కాదు.. ఇక ఇహమో పరమో తెలియని పరవశాల పరమా నా జీవనం అనే ఆలోచనే కాని......
ఇది కృష్ణయ్య గొంతునుంచి జాలువారిన మధుగీతం.
కాలం నింపుతున్న కావడి బిందెలు
ReplyDeleteమనసు దుబ్బుల్లోకి తొణికితే,
కన్నీటి గంగావతరణం అన్నట్లే..
గతం నింపుతున్న లంకె బిందెలు
మనుగడలో పాతుకుపోతుంటే,
రేపు కొరకు అన్వేషణ సాగినట్లే..
అక్షరాల హస్తాల్లో గోరువెచ్చని స్పర్శ,
పదాల పాదాల్లో ఆనంద నర్తన,
వెదికే మనసుకి లేనిది ఏది..
భావన, థాంక్స్..ఆ పై భావనల వెంబడి వచ్చే శోకం కూడా బావుంటుంది.. మనసేగా మనిషికి ఆత్మబంధువు. దానికన్నా విలువైంది ఎవరూ వుండకూడదు. మనిషి కడ దాకా కలిసి వుండగలిగేది ఒక్క మనసుతోనే కదా. ఒంటరితనం శాపం కాదు, ఓ వరం. ప్రతి పదానికీ మూలం మనసు ఏ మూలో దాచుకున్న జ్ఞాపకమేగా.
ఉష గారూ, నాకు తోచినట్లు రాసాను ఎలాఉందో చెప్పండి .
ReplyDeleteమదిలో పెనవేసుకున్న ఊసులు ఎలా తెలుపను ప్రియా?
ఈపున్నమి వెన్నెల రేయిలో నీరాకకై ఆరాటపడుతున్ననా హృదయపు లోతులలో తొంగిచూడు
నా మనసంతా నిండి ఉంది నువ్వే కదా .
ఈ విరబూసిన జాజిపందిరి మాటున నీతో ముచ్చట్లకై నా మది పెడుతున్న ఆతృతనడుగు నా విరహాగ్నిని తెలుపుతుంది .
నీకై నా నిరీక్షణలో కూడా ఇంత హాయి ఉంటుందని తెలిసింది ఈరోజే ప్రియ.
రాధిక, బావుందండి. రాస్తూ పోతూ, రాసినదాన్ని మెరుగులు పెడ్తూ పోవటమే, ఎవరూ కవి, రచయిత అని విగ్గులు పెట్టుకు పుట్టరు. ఇది నాకు బోధించబడిన గురూ/హితోపదేశం. అదే మీకూ నేను చెప్పాను. కాలమే నిగ్గు తేలుస్తుంది అన్నిటినీ. థాంక్స్ మీ ప్రయత్నానికి.
ReplyDeleteకొబ్బరాకూ గాలి కొండ కోనల వెతికి
ReplyDeleteనిండు చంద్రుని ఎదుట నీతలపు కౌగిట
అద్దమల్లే తోచె ఆవంక కెరటాలు
ఇద్దరిని మిగిలాయి మన కలల వెన్నెలలు
వెండితలపుల జాలు వెలుగు ధారలు కురియ
ఒక్కింత ఒణుకుతూ తడిసి మెరిసిన మనసు
అణువణువు వేణువై గమకాలు పలుకుతూ
ఒదిగి నీ కళ్ళలో వెలుగునై పోయానా
ఈసుతో గగనాన కన్నెర్ర జేయుచూ
నల్ల నల్లని చూపు గుడ్లురిమి గొణుగుతూ
మిన్నంటు రోదన లొ ప్రబలి పొగిలే బాల
కన్నీటి కాలువల మనను ముంచెత్తగా
నీకు నేనై నాకు నీవై ఆగిపోయిన ఈ క్షణాన
చుక్కలన్నీ ఒక్కసారే దిగులు వాకిట రాలి పడ్డా
లోకమంతా శూన్యమైనా దారులన్నీ వాగులైనా
మనకు మాత్రం పాలపుంతే మనసుకైతే మల్లెతోటే
sweetee, అనుకోని చిరుజల్లు అలా మోముని తాకిపోతుందే అస్సలు ఊహించని వేళల్లో.. ఈ అనుభూతి మీకు ఎప్పుడైనా అనుభవమయిందా? నా మనస్థితి అదే ఇప్పుడు. విశ్వామిత్ర నా ఊహాజగతికి ఊపిరులు. వారిని గూర్చిన మీ కవిత ఇవాళ్టి నా భావోద్వేగానికి మూలం. నెనర్లు. మీ పేరు కొత్త నాకు, ఇది మీ తొలివ్యాఖ్య. అయినా ఆ పాదం మీద పాదం మోపి నాకు బాగా పరిచితులు అయిపోయారు.
ReplyDeleteనేను ఇక్కడకి రాలేదు ;-)
ReplyDeleteమంచు.పల్లకీ గారు, సరేనండి, "పడలేదు దూకారు." {ఎంతైనా సూపర్ స్టార్ కృష్ణ గారు ఎందర్ని కాపాడారో] :) "రాలేదు, రప్పించబడ్డారు." తప్పలేదు మరి మీరు మాత్రం ఏంచేస్తార్లేండీ.
ReplyDeleteఉష గారూ అది రాసినది నేనుకాదు. మీ మరువం నాతో రాయించింది. నేనూ మీ భావాలు చూసాక అలాగే చలించిపోయాను . నాలాంటి వారు మరొకరున్నారని ఆనందపడ్డాను.
ReplyDeleteస్వీటీ గారూ, ఆ ఆ ఆ..ఆగండాగండి. "సరే అయితే మనం మనం ఒకటిక," అనను. ఇదొక ఎమోషనల్ ప్లేన్. ఇందులో వసించేది "నేను తను" లేదా "నువ్వు నీ ఆత్మ". నాతో మెసలలేక వీగిపోయిన బంధాలు గుర్తొచ్చి ముందే హెచ్చరిద్దామని. :) గట్టున తలబాదుకుని నురగ నెత్తుళ్ళు కక్కే నది నా మది ఒక్కోసారి..ఆ జిగట గాయాల్లో గవ్వలు, రాళ్ళు నింపి కన్నీళ్ళ పాయలు కప్పి సాగిపొయే వెర్రిదీను. ఈ పార్శ్వం కూడా ఈ కవితల్లో మోయగలననుకుంటే ఆ ఆనందాన్ని అలాగే గానం చేయనీయండి. ఈ భాష్యమూ తెలిస్తే అప్పుడు కాస్త సాపత్యం ఉన్నవారమని అందురు గాని. ఏమైనా బంధం కలేసినందుకు నెనర్లు.
ReplyDelete