అడుగుల సడి


పరుచుకున్న పొగమంచు మీద పాదముద్రలు,
నీలోకి సాగే పయనాలు ఒకటే..
అడుగు పడినాకే పాదం మోపిన వైనం తెలిసేది. 
భ్రమ, భ్రమణం అనేవి నిను అలుపు ఎరుగనీయవు.
ఎందుకు?
అవి నీవే ఆవిష్కరించుకునే, పరిష్కరించుకునే మాయావలయాలు
మరి ఇక,
ఆగక సాగే సాధన అమాశ వెంబడి వచ్చే పున్నమి వంటిది, 
తిమిరానికి వెరవక వెలుగులోకి పడాలి అడుగు…
 

No comments:

Post a Comment