కూరిమి

'మారాము చేసానులే...'
మూసిన తలుపుల నుంచి
దూసుకువచ్చే వాన సడిలా
బిగించిన ఆ పెదాల నుంచి
చిన్న మాట!

దుఃఖ మేఘం కమ్ముకున్న
తన కనులు
దిగులు భారం మోయనన్న
తనువూ
ఈ చేతులలో...

'గారాలు నీవంతు కదు!?'
మాట సవరించిన తన మమత,
జడిగా, సడిగా ఎన్నెన్నో జల్లులు
తేటపడ్డ ఆకాశమై
ఇరువురి అనుబంధం.

2 comments:

  1. Replies
    1. నెనర్లు పృధ్వీ. అలా తాకిపోయిన ఉద్వేగం!

      Delete