ఒడి ఇచ్చిన అమ్మ వెళ్ళిపోయింది,
బొడ్డు కోసిన బాపనమ్మా అటే మళ్ళింది.
బుడి బుడి నా అడుగులకి చేయిచ్చిన తాతయ్య,
బతిమిలాడి బువ్వ పెట్టిన అమ్మమ్మా అక్కడే వున్నారేమో ఎప్పట్నించో
పడక్కుర్చీలో పడేసానని గోడకుర్చీ వేయించిన వెంకట రత్నం మాస్టారు,
పూలజడలేసి దిష్టిచుక్కలెట్టిన పంకజమత్తా,
నా కళ్యాణం చూసే వెళ్తానన్న నానమ్మ, మా చెల్లి,
ఒకరివెనుక ఒకరు వెళ్ళిపోయిన ఆ లోకమొకటి వున్నది
నేనూ వెళ్తాగా ఓ రోజు వాళ్ళప్రక్కకి. ఇపుడు మాత్రం దోవ తెలియకున్నది.
ఒప్పులకుప్ప తిప్పిన అమ్మాజి,
తొక్కుడుబిళ్ళలాడిన కుమారి,
గొబ్బిపూల దండలిచ్చిన దత్తుడు,
గొబ్బిళ్ళలో నీళ్ళు పోసివెక్కిరించిన శంకరి
గిల్లికజ్జాలాడిన నాని గాడు, గోరింటాకు పెట్టిన జానకొదిన
ఓణిలేసేసుకోకే జట్టునించి పోతావని బెదరగొట్టిన బావ
ప్రేమ నిఘంటువులో క్రొత్తపదం నువ్వన్న మదనూ
హారతితో కుంకుమద్ది ప్రేమలేఖ లిచ్చిన కుర్ర పూజారి
వున్నారక్కడక్కడా నాకు చిరునామా ఇవ్వకుండా,
మీక్కనిపిస్తే కుశలమడిగానని చెప్పండి, నాకూ వీలుపడదని చెప్పండి కలుసుకోను.
Oooo..
ReplyDeleteBeauuuuutiful :-)
Felt sad about your sis though.
Thank you for the respect you showed for her. ఎప్పుడూ దాని బ్యాగులు మోసి మోసి, పిచ్చి తల్లి ఇపుడెవరినడుగుతుందో అసలడగటం కూడా సరిగా తెలియదే అనుకుంటాను.
ReplyDeleteManasu oke sari rakarakala bhavanalaki lonayyindandi. adbhutamaina varnana...
ReplyDeleteఅవును లక్ష్మి గారు, మనమేమీ వెన్నెల్లో ఆడపిల్లలం కానక్కరలేదు కాసినన్ని గురుతులు మూటకట్టుకోవటానికి.
ReplyDeleteenta baagaa raasaarandi.. keep it up :)
ReplyDeleteఅవును "నేస్తం", నేను కూడ ఇక్కడే తడిసి మా కిటికీమీద కారుతున్న వానధారల కన్నా ఉరకలైపోతున్నాను. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
ReplyDeletemee antha andam ga cheppatam naaku raadu kani, chala baaga raasaru.!!
ReplyDeleteNice..
ReplyDeleteఇన్ని జ్ఞాపకాల వర్షంలో రోజూ తడుస్తూ ఉండటం.. ఒక్కోసారి బాధగాను, ఒక్కోసారి ఎవరికీ (మనకు కూడా) అర్ధం గాని భావనల్ని కలుగ చేస్తుంది. ఈ కవితలో కనిపించే ప్రతి జ్ఞాపకం ఎంత బరువైనదో!! ఎవరన్నారు జ్ఞాపకాలన్నీ మొహాన చిరునవ్వుల్ని పూయిస్తాయని? కంటి చివర కన్నీటిని కూడా చేరుస్తాయి.
మరువము అంటే అర్ధం అడిగారు కదా? అంటే ఒకరకమైన తియ్యని సువాసనలని ఇచ్చే చెట్టు (తులసి చెట్టు కూడా). మీ బ్లాగు ఇలానే మంచి సువాసనలని అందించాలని కోరుకుంటూ..
ఉషా..
ReplyDeleteమనసుకి హత్తుకొనేలా మీ భావాలని చెప్పారు.
నిజంగా చాలా చాలా బావుంది.
మీ బ్లాగు పేరు మీరు రాసేవాటికీ చక్కగా కుదిరిందీ..
ప్రతాప్ గారు చాలా చక్కగా చెప్పారు.
ReplyDeleteనావీ అవే మాటలు.
మరువం అంటే అది ఒక మొక్కపేరు. చిన్న చిన్న ఆకులతో గొప్ప మత్తైన వాసననిస్తుంది. దాని వాసన పూలనుండి కాక ఆకులనుండి వస్తుంది. తులసిని కూడా మరువం అనొచ్చని తెలియదు. మా వైపు (తూగోజి) మరువపు రెమ్మలను సన్నజాజులు/మల్లెల మధ్య ఉంచి, మాల కడతారు.
మరువం లాంటిదే మరొక మొక్క దవనం.
అమ్మో ఉష గారు ఒక్క నిమిషం భయపడి చచ్చా, ఆ కింద లిస్టు లో ఉన్న వాళ్ళని కూడా పైకి పంపిచేసారేమో అని.అయిన వాళ్ళని కలుసుకొను వీలు పడదని డిసైడ్ అయిపోతే వాళ్ళు కూడా లేనట్టే కాదండి. పుట్టాము గనక తప్పదు చావక ముందు వెనక తేడాగా అని పాడు కుంటూ ఉంటారా ఏంటి మీరు?
ReplyDeleteప్రతాప్ గారు, ఇంతవరకు మరువపు మొక్కలేని ఇంట నేజీవించలేదండి. ఇపుడూ ఈ చలిగాల్లో కూడా it's with me though survives in warm weathers alone.
ReplyDeleteబాబా గారు, దవనంగురించి తెలిసిన మరొకరున్నారని మహదానందంగా వుంది. మరువం పెంచి, దవనం కొనుక్కునే అలవాటెపుడూను. ఇపుడెవరినడిగినా do you know the botanical name? అనడుగుతున్నారు. మరువం పేరు Origanum majorana తెలుసు కాని, దవనమే సంపాదించలేకు
న్నాను.
autographలు వ్రాసుకునే మొదటి రోజుల్లో 'వాడినా వాసన వీడని మరువం వీడని మన స్నేహం' అని నేస్తం ఒకడు వ్రాసాడు [మీవెవరివైనా అయితే ఈ పలుకులు మన్నించండి. వాడెక్కడున్నడో నాకు ఈ post సాక్షిగా తెలియదు ;) అందుకే నా మొదటి మాటకి ఆ పలుకులే ప్రస్తావిస్తూ సాగించానీ సాహితీ పయనం.
సుజ్జీ, మధురవాణీ గార్లకు నా ధన్యవాదాలు.
రవి గారు - 'మహిలో చింతలు ..వదలవు నీ.. వొద్దనకా' అని అన్నమయ్య చెప్పాడు కదా, అదే follow అయిపోతున్ననాన్నమాట. అంత పాత పాటలు నే పాడనండీ ఎప్పటికప్పుడు update అయిపోతుంటాను :) అందుకని ఈ మధ్యనే విన్న పాట పాడుకుంటున్నానిప్పటికి "కనులు తెరిస్తే జననం, కనులు మూస్తే మరణం, ఈ రెప్పపాటులో..." ఇక ఇపుడు మీకొక ప్రశ్న - ఇది ఏ సినిమాలోదో చెప్పగలరా? మీకిస్తున్న సమయం 10 నిమిషాలే ;)
ఉషాగారూ మరువం,ధవనం మర్చిపోగలమా?ఒక్కసారి కళ్ళు మూసుకుని గట్టిగా గాలిపీలిస్తే ఇప్పుడూ ఆ సుగంధం నాచుట్ట్టూ వున్న అనుభూతినిస్తుంది.మా ఊరిలో అయితే మరువం లేని ఇల్లు వుండేది కాదు.ఇక మీ కవిత ఒక పక్క కన్నీటిని తెప్పించింది.ఇంకో పక్క చిరు నవ్వులూ పూయించింది.మీ కామెంట్లు కూడా ఎంతో టచింగా వున్నాయండి.
ReplyDelete"కనులు తెరిస్తే జననం, కనులు మూస్తే మరణం, ఈ రెప్పపాటులో..." ఇక ఇపుడు మీకొక ప్రశ్న - ఇది ఏ సినిమాలోదో చెప్పగలరా?
ReplyDeleteఈ మాటలు ప్రజా కవి కాళోజీ గారివి
కనులు తెరిస్తే జననం
కనులు మూస్తే మరణం
రెప్ప పాటే జీవితం.
ఇక్కడ రెప్పపాటే అన్న మాటలోనే ఈ పద్యపు బరువువంతాఉంటుంది
ఇంతకీ ఇది సినిమాలకెక్కి మరొకరి పేరున చలామణీ అయిపోతున్నదా ఏమి?
ఉష గారు పది నిముషాలు కాదు కదా పది సంవత్సరాలు ఇచ్చినా కూడా మరణం పాట నేను మననం చేసుకోను కాబట్టి చచ్చినా గుర్తు వచ్చే అవకాశం లేదు.మీరే సెలవియ్యాలి.ఇక మరువం, ధవనం , జంట కవుల్లా వుంటూ అవి వెదజల్లిన ఘుభాలింపులను యెద లో పదిలంగా మోసుకుంటున్న ప్రతి భావకునికి అవి అజరామరం.
ReplyDeleteఅజ్జబాబోయ్ నాకు నిజ్జంగా ఇలగనీ తెల్దండీ బాబా గారు. మీరసలే దేశభక్తుల వారసులు, కానీ నాకు ఈ కవితాద్రోహంలో కాని, కల్తీలో కానీ భాగం లేదండి :( అసలీ కొత్త కవిగారితో నాకే పరిచయమూ లేదు. "ఉహుహూ అని లోకమొడకె ఉర్వీనాధా!" అన్న భాస్కర కవి వర్ణించినంత, కోటు బోను కన్నా భయంకరమైన, మా backyard deck లో నిలబడి సుమతీ శతకం మీద ప్రమాణంచేసి చెప్పేస్తున్నాను - "కనులు తెరిస్తే జననమెలే, కనులు మూస్తే మరణమేలే, ఈ రెప్పపాటులో జీవితమంతా సాగునులే..." పాట ఎందుకైనా మంచిదని 10 సార్లు విని ఖరారు చేసుకొని సెప్తున్నా బాబయ్య, ఇది "నేను మీకు తెలుసా?" చినేమాలోదండి. ఇక నన్ను copy rights ఉల్లంఘన చట్టంకి పట్టించరని నా నమ్మకం.
ReplyDeleteరవి గారు, పోన్లేండి నాకు భూత దయ అధికం, అందుకు మీకు సమాధానం నేనే ఇస్తా, అయ్యో నా మతిమండా బాబా గారి పెట్టిన భయంతొ బిక్కచచ్చి మీకూ కూడ అదే సమాధానం చాలని మరిచాను. :) బ్లాగు మిత్రులకు వేల వందనాలు, వెవేల ధన్యవాదాలు.
రాధిక, మీ పలుకు కోయిల కూజితంలా నాకు మాత్రం భలే వినసొంపుగా వుందండి. ఎదో మీ అభిమానం, ఎవరికి రాదండి ఈ సరి commenting కళ? :)
ReplyDeleteఎంత బాగా చెప్పారు ఉషాగారు. అభినందనలు.
ReplyDeleteధన్యవాదాలండి. మీరు మళ్ళీ నా బ్లాగుకి రావటం ముదావహం, ఆత్రేయగారు.
ReplyDeleteబావున్నై ఉషగారూ. నేను చదివే బ్లాగుల గుంపులో మీ బ్లాగు కూడ చేర్చేశాను ఈ రోజు :)
ReplyDeleteబాబాగారు,
"జాజులు, మరి విరజాజులు, ధవనము రాజిత త్యాగరాజవినుతునికి... గంధము పుయ్యరుగా" అనిన్నీ "మరువక పారిజాత సరోజ... తులసమ్మా మా ఇంట నెలకొన్నావమ్మా శ్రీతులసమ్మా" అని త్యాగరాజులవారి కృత్యువాచ. నేనూ తూగోజికి చెందినవాడినే. నాకు తెలిసినంతలో మరువం తులసి వేరువేరు (ఎంత వేరంటే సంపంగికీ జామకీ ఉన్నంత తేడా ఉంది ఆ రెంటికీ మధ్య).
ఉషగారు,
ReplyDeleteనిజంగా మనసుకు హత్తుకునేలా ఉంది. ఒకసారి బాధ, ఓకసారి చిరుమందహాసం.. !!
మరువం, దవనం పూలమధ్య పెట్టి మాల కడతారు. అవి వాడినా కూడా పరిమళాన్ని ఇస్తాయి..
కాని రూపంలో రెండు వేరుగా ఉంటాయి..
thank you thank you so much రాఘవ గారు, ముందే విప్పిచూసుకున్న క్రిస్మస్ కానుకలా వుంది మీ మొదటి వ్యాఖ్య.
ReplyDeleteనాకు "జాజులు, మరి విరజాజులు, ధవనము రాజిత త్యాగరాజవినుతునికి... గంధము పుయ్యరుగా" పూర్తి కృతులు పంపగలరా ushaa.raani@gmail.com కి?
*****
జ్యోతి గారు, అమ్మో నా గుండె ఇక పట్టలేనంత సంబరంగావుంది. మీరంతా ఇలా నా లోగిల్లో నడయాడివెళ్తుంటే. అపుడపుడూ వచ్చిపోరా, మనియాద కాస్త ముడుచుకుంటది, లేకుంటే నను మింగాలని చూస్తుంది మాయదారిది!
WOW.. Beauty!
ReplyDeleteమనసారా "నా" అనే ప్రతీ ఒక్కరినీ తల్చుకున్నానండీ! ధన్యవాదాలు. "నా" అని అనలేకపోయిన వారినెలా సంప్రదించాలో మరో టపాలో చెప్దురూ!
చాలా బాగా రాశారు!
తప్పకుండా పూర్ణిమ! "ఈ శీర్షిక మీరే పెట్టాలి" చదివి చూడండి మీకేమైనా కొన్ని జవాబులు దొరుకుతాయేమో?
ReplyDeleteనాకు వ్యాఖ్యానించాలని లేదు
ReplyDeleteఅలాగే ప్రదీప్, వ్యాఖ్యానించాలని నేనూ అడగలేదుగా. కేవలం "పూలజడలేసి దిష్టిచుక్కలెట్టిన పంకజమత్తా," అన్న పంక్తి మీకు ఏదైనా సూచన ఇవ్వొచ్చని అడిగాను. మరి రెండో కవిత మీద ఏమిటో మీ అభిప్రాయం? డిట్టోనా..
ReplyDeleteఏమిటో నా బుర్రకు ఎంత ఆలోచించినా తట్టడం లేదు ఈవాళ. మీరు చెప్పదల్చుకున్నదేమిటో మీరే చెప్పరాదూ.
ReplyDeleteఇక మీ టపా టైటిలు "శీర్షిక పెట్టాలని లేదు" కనుక అదే రీతిలో "వ్యాఖ్యానించాలని లేదు" అని రాసాను. అంతే కానీ నాకు నచ్చక కాదు
మరిదేనండి ప్రదీప్, గోరంతలు కొండంతలు చేయటమంటే :) ఈ కవిత చదవమన్నది, ఆ జడ ప్రస్తావన వున్నదనే అదీ నా జడకాబట్టి [మీరన్న జడలు మాయమవటం, పూల సాంప్రదాయం తరిగిపోవటం లేదని చెప్పటానికి]. కనుకా కాస్త బుర్ర బద్దలు కొట్టుకోవటం ఆపండి. అయినా పెద్ద విషయాలకిక ఏమి పగలు కొడతారోమరి... :)
ReplyDelete