ఎవరో నన్ను కౌముదికి తప్పా, వేరే పత్రికలకి పంపరా? అని
నిష్టూమాడారు..కిరణ్ ప్రభ గారు- అరుదైన అభిరుచి కలిగిన సంపాదకులు,-
ఒద్దికైన తీరు కలిగిన సాహిత్యాభిమాని. చాలా పదిలంగా భావన చెడని విధంగా
మార్పులు చేస్తారు, విలువైన సమయం వెచ్చిస్తారు. అందుకు ఉదాహరణ, నేను పంపిన ఈ
క్రింది పాదం లో తను చేసిన సూచన ప్రచురించిన కవితలో ఉంది. ఆపై, ఆయన
సునిశితం గా నా అల్లికలోని బిగి కనిపెట్టిన తీరు నాకొక బంగారు మురుగు వంటి
కానుక! నిజమైన ప్రోత్సాహం ఎలా ఉంటుందో అనేదానికి చిహ్నం...
"'మేఘాలు కరిగి నేలని తాకుతుంటే
మట్టి బంతులు చేసి కానుకిచ్చిన మురిపెం
"'మేఘాలు కరిగి నేలని తాకుతుంటే
మట్టి బంతులు చేసి కానుకిచ్చిన మురిపెం
తడి నేల మీద పాదాలు సాగుతుంటే
మనస్సు పసిపాపలా నవ్విన సత్యం' కవితలో అన్ని చరణాల్లోనూ మొదటి పాదంలోని అనుభవాన్ని రెండో పాదంలో అనుభూతితో పోల్చారు. బావుంది..
ఈ క్రింది చరణంలో మాత్రం మొదటి పాదంలోని వస్తువే రెండో పాదంలో రిపీట్ అయింది. అది మార్చి మిగతా పాదాలతో సరితూగేలా చేస్తే
మంచి కవిత అవుతుంది.. కౌముదిలో ప్రచురిద్దాం.." - కిరణ్ ప్రభ
మరికాస్త ఆస్వాదిస్తే
- మరువం ఉష
పసిపాప చూసి నవ్వగానే
గుండెల్లో పక్షులు వాలినట్లుగా హాయి,
చిటారుకొమ్మల్లో పిట్టలేవో పాడుతుంటే
తోటల్లో పిల్లగాలులు ఆడుకున్నంత శాంతి,
వాగు మీద గాలి అలలు ఊగుతుంటే
ఒడ్డున నావలు నాట్యమాడినట్లు ఊహ,
నావలో తెరచాప రెపరెపలాడుతుంటే
ఆకసాన మబ్బులు ఎగిరినట్లు భ్రాంతి,
మేఘాలు కరిగి నేలని తాకుతుంటే
మట్టి బంతులు చేసి కానుకిచ్చిన మురిపెం,
తడిమట్టి మీద అడుగులు వేస్తుంటే
మనస్సు పసిపాపలా నవ్విన సత్యం,
అనుభవం భావనగా మలచుకుంటే
గమనం నుంచి సాగే అనుభూతిది నిత్య గమనం
(ఫిబ్రవరి 2018 కౌముది పత్రికలో ప్రచురితం)
మనస్సు పసిపాపలా నవ్విన సత్యం' కవితలో అన్ని చరణాల్లోనూ మొదటి పాదంలోని అనుభవాన్ని రెండో పాదంలో అనుభూతితో పోల్చారు. బావుంది..
ఈ క్రింది చరణంలో మాత్రం మొదటి పాదంలోని వస్తువే రెండో పాదంలో రిపీట్ అయింది. అది మార్చి మిగతా పాదాలతో సరితూగేలా చేస్తే
మంచి కవిత అవుతుంది.. కౌముదిలో ప్రచురిద్దాం.." - కిరణ్ ప్రభ
మరికాస్త ఆస్వాదిస్తే
- మరువం ఉష
పసిపాప చూసి నవ్వగానే
గుండెల్లో పక్షులు వాలినట్లుగా హాయి,
చిటారుకొమ్మల్లో పిట్టలేవో పాడుతుంటే
తోటల్లో పిల్లగాలులు ఆడుకున్నంత శాంతి,
వాగు మీద గాలి అలలు ఊగుతుంటే
ఒడ్డున నావలు నాట్యమాడినట్లు ఊహ,
నావలో తెరచాప రెపరెపలాడుతుంటే
ఆకసాన మబ్బులు ఎగిరినట్లు భ్రాంతి,
మేఘాలు కరిగి నేలని తాకుతుంటే
మట్టి బంతులు చేసి కానుకిచ్చిన మురిపెం,
తడిమట్టి మీద అడుగులు వేస్తుంటే
మనస్సు పసిపాపలా నవ్విన సత్యం,
అనుభవం భావనగా మలచుకుంటే
గమనం నుంచి సాగే అనుభూతిది నిత్య గమనం
(ఫిబ్రవరి 2018 కౌముది పత్రికలో ప్రచురితం)