శేషేంద్రుల స్మృతి లో; Early Spring Colors & Flowers


 "ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను"


"ఒక పువ్వెడు వసంతం కోసం చెట్లు ఆకులన్నీ రాల్చుకొంటున్నాయి" గుంటూరు శేషేంద్ర శర్మ

Doors into Spring Now Open!


రెక్కలహోరుతో పిట్టలో, వేనవేల చివురుపచ్చల, వన్నెచిందే మొగ్గల మొక్కలజోరుతో నేలలో వసంతుని వాకిట నిలిపిపోయినది!


Watch closely with wide opened eyes; I took from behind the tree through a loop formed in the branches. The beak and the bud share same color! What this Dark-eyed Junco is after into the tender Spring shoots on this tree!? I am not sure but for sure this angle is a treat to my camera's eye and catch!!!

Despondence

Some vague fears rake up flares to torment the heart,
Wrench and reduce you to a heap of ashes.
You long for the caressing touch of either memories or dear ones,
And would be eager to resist the arresting angst.
Strangely, they too get incinerated and transform into you.
And you ultimately remain…
A purple glow of doleful despondence.
*****
నిర్వేదం...
ఏవేవో దిగుళ్ళ నెగళ్ళు సెగలు రేపి ఎదని కాల్చుతూ ఉంటాయి,
మెలిపెట్టి బూడిద రాసిగా మారుస్తుంటాయి
జ్ఞాపకాలవో ఆత్మీయులవో స్పర్శ తెచ్చి అద్దుకోవాలని,
ఆవేదనని అడ్డుకోవాలని ఆత్రుత పడతావు
చిత్రంగా అవీ కాలిపోతాయి,నీ రూపుగా మారిపోతాయి,
చివరికి ఒక ఊదా మెరుపు నిర్వేదం గా మిగిలిపోతావు…

ఒక ఉదయం

జల్లెడ లో మిగిలిన మొరుం లా
నేల కి నింగి వంపిన మంచు
నిన్నటి మెత్తని పిండి వాన ని మించిన నిస్సవ్వడి తో

అడుగు బొడుగు గోదారి గీక్కుని నేతి వాసన పీల్చుకునే పిల్లల్లా
ఈ పిట్టలు పేరుకున్న మంచు కింద మేత గింజలు పొడుచుకు తింటూ

ఆరిన పొయ్యి దాపున దింపిన కావడి కుండల్లా
వెచ్చజూపిన నిన్నా మొన్నల ఎండ కనరాని శీతకట్టు పొద్దున
లోనంతా పచ్చని జీవం నింపుకుని కాండమెల్లా బిగిసిన ఈ చెట్లు

ముప్పేట అల్లికలైన ఈ రెప్పపాటు...గుండె కండెకి కాలం చుట్టిన దారప్పోగు!

తనలోని తానైన తను

ఒక పరి

వెర్రెత్తి పీల్చుకున్న సంద్రాన్ని ఎత్తి విసిరి ఆకాశం వరకు పారేస్తుంది
చంచల చిత్తయై, వర్ష నాళికల వేయి నాలుకల లాలాజలమై సొంగలు కారుస్తూ
మబ్బుల ఉదరం పిండుకుని ఉరుములై పిడుగులై వ్రక్కలై ఎదురౌతుంది
నేల కి ఇనికిన నీరే జీవమై జవసత్త్వమై చివురాకుల మొగ్గల పిందెల వన్నెలలో ఉపశమిస్తుంది
ఇంకొక పరి వైరాగ్యమా, త్యజించటమా- ఎవరెరుగని పోకడ

రేకులు రాల్పుకుని వసంతం ఊరు వాడలు విడిచి పోయే వరకు వడగాడ్పు గాలుల రమిస్తూ
పండుటాకులు విసర్జించుకున్న ఋతువు రాకపోకలు సాగే వరకు
ఉందనిపించే అందం ఆగదనిపించే చందం...
ప్రశాంత గగనం, తేలిక పడ్డ వనం తనకు మిగిలే- వరకు ప్రకృతి
తాను నేను...నేనైన తానో, తనౌతున్న నేనో?