"ఎద చుట్టూ అదృశ్యం గా అలుముకున్న ఆవరణ
మునుపెన్నడూ ఎరుగని ఆఘ్రాణింపు తో కవ్విస్తుంది
అక్షరాలు ఊపిరి పోసుకుంటూ నన్ను పీల్చుకుంటాయి
వ్యక్తానువ్యక్తంగా వేయి ఆవరణలు
వేచి ఉన్నాయి కల/పు/వేటు దూరాన"
మరువపు మైత్రి వనవాసులకు,
ఈ ఏడాది సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యశీలి అయిన మా నాన్న గారికి అనురాగ పురస్కారం గా - తనకి అంకితమిచ్చిన - 'మరువం' కవితా సంకలనం ఈ నెల ఏకాదశి కి ఆయన చేతుల మీద గా విడుదల అయింది. ఈ ఆనంద ఘడియల్లో నన్నెరిగిన మిత్రులను, అభిమానించే వ్యక్తులను కలవాలని అభిలషిస్తున్నాను.
ఈ నెల 13 (08/13/13) కి హైదరాబాదు లో విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4:30కి సమావేశమై, స్వల్ప సంభాషణ అనంతరం 6:30-7:00కి విందు. ఈ వేడుకకి రాదలిచిన వారు నా స్నేహితురాలు జ్యోతి, jyothivalaboju యట్ gmail డాట్ com కి సమాధానం (08/11/13 లోగా ) పంపితే ఇతర వివరాలు అందిస్తాము. నేను ప్రయాణం నడుమ ఉన్నందున తను నా తరఫున సహాయం ఇస్తుంది.
ఎవరెవర్ని కలవగలనా అన్న కుతూహలం, ఇదంతా అతి త్వరలోనే అన్న సంతోషం తో ఎదురుచూస్తూ,
మీ మరువం ఉష.