“మీరు తమిళులుగా పుట్టినా తెలుగు భాష అంటే ఇంత అభిమానం ఉండేదా?” అని స్నేహితులొకరు నన్ను ప్రశ్నించారు. నా సమాధానం “లేదు, ఇది నా మాతృ భాష. తెలుగుని గౌరవిస్తూ, తెలుగు మాటని తృప్తిగా వాడటం నా వరకు మా అమ్మ పెట్టిన పెరుగన్నం తిన్నంత కమ్మన.” కనుక నేను తెలుగమ్మాయిని, తెలుగమ్మని ఇప్పటికి, తెలుగవ్వనీ అవుతాను ఒకప్పటికి.
తెలుగు భాష – అమ్మ భాష అంటూ మాధవరావు గారు రాసిన పాట (బాణీ కట్టి పిల్లలకి నేర్పాలని అనుమతీ తీసుకున్నాను), దీనికి ముందు రాసిన నా పోస్ట్లో రసజ్ఞ గారన్న “అదేదో పరాయి దేశం వాడు మెచ్చుకుంటే తప్ప మన మాతృ భాషకున్న విలువ తెలుసుకోలేని స్థితిలో ఉన్న వారున్న ఈ రోజుల్లో…” అన్న మాటల వెంబడి, అలా అలా తలపోతల్లో 02/11/2010 నాడు రాసిన కవిత స్ఫురణ కి వస్తే అది నా పాత బ్లాగు నుంచి ఈ బ్లాగుకి తెచ్చాను. యధాతధంగా పెట్టేసాను. తెలిసిన భాషని పదుగురుకీ పనికి వచ్చేలా తీర్చి దిద్దాలని, పంచాలన్నదే నా ఆకాంక్ష. పరభాషలకు వ్యతిరేకిని కాను, మాతృ భాషాభిమానిని.
మీ ఉష.
02/11/2010: 08:25:00 PM
అనుచితపోకడల్లో చిక్కిన అక్షరానికి నా వంతు వందనం సమర్పిస్తూ...
సరస్వతీదేవిని ఒక్కసారి ఇలా అభిషేకించాలని..
సరస్వతీదేవిని ఒక్కసారి ఇలా అభిషేకించాలని..
మరి నలుగురు పఠిస్తే ఆ తల్లికి సేవ.
*************************
అమృతం సేవించకనే చిరాయువువి
ఆదిపరాశక్తిని నుతించగ కనకధారవి
ఇహము పరము ఎరుక పరచగ పదసోపానివి
ఈశ్వరుని కనులెదుట నిలిపేటి జ్యోతివి
ఉత్తుంగ తరంగమైనా, ఉప్పెనవైనా నీకే చెల్లు
ఊహాతీతలోకాన కదనాశ్వానివి నీవు
ఋషీశ్వరుల తూనిక జార్చిన స్వర్ణాభరణం నీవు
ఎన్నో చరితలు చెప్పినదానవు
ఏ యుగానైనా జాతి మనుగడ నీవు కూర్చేడి భాషే
ఐహిక జీవిత పరమార్థ బోధనకీ నీవె మూలాధారం
ఒద్దిగ్గా నీవమరిన వాక్యం అపురూపం
ఓంకారాన ఒదిగింది, ఓరిమి బోధించినది నీ అల్లికలే
ఔన్నత్యం పదంలోనేనని చూపిందీ నీవే
అందమైన మనసుని పరచగ ఆలంబన నీవే
అచ్చుల్లో, హల్లుల్లో భావావేశాలు పొదగనీ
నీ అమర చిత్రం నను మరోమారు దర్శించనీ
సరిగమల అలరింపుల్లో నర్తించావు
తకధిమితోం పాద కైతల్లో నడయాడావు
సెలయేటి పాటల్లో ఈదులాడావు
సంద్రపు అలలంటి కావ్యాల్లో కదలాడావు
నీ దివ్య తేజసుని మాకు అనునిత్యం ప్రసాదించు
క్షమనొసంగి మనిషి అల్పగుణాన్ని అంతమొందించు
పలుకున, పదమున నిను ధ్యానించు ఇంగితమివ్వు
నాగరికత కి ఆలంబన అక్షరం అని నినదించనీ
విచ్చుకత్తులు రువ్వేటి వికృతభావనల్లో అలిసావా
మనసుని పొడిచేటి శూలమయ్యానని వగచావా
అమానుష కలానికి చిక్కానని వణికావా
నీ స్వేచ్ఛనదిమేటి కుయుక్తి నిలబడునా కలకాలం
కవాటాలకి కళ్ళెం వేయగవారెవరు
గవాక్షాలు మూయగల శక్తులేవి
అక్షరజ్యోతికి చమురులేనిదెక్కడ
కవితామతల్లికి పూజలందనిదెన్నడు
**********************
బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్
కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్
హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజ దార సుతోదర పోషణార్థమై !!
కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భరతీ !!

పదం పర గతమై రాజుల చేతిలో ఇచ్చి తన కూతురు వంటి కావ్య కన్య ను రాజుల చేతిలో పెట్టి డబ్బు తీస్కోవటం ఆ పడుపు కూడు కంటే వ్యవసాయం చేసుకుంటూ వుండటం మేలని పోతన గారి పద్యం.
ఆయనకు ఒక రాత్రి సరస్వతి కనపడి ఏడ్చిందట ఇలా నన్ను ఎందుకు ఇలా అమ్ముకుంటున్నావు అని.
ఎందుకో మనసులో అది తోచింది.
ఆయనకు ఒక రాత్రి సరస్వతి కనపడి ఏడ్చిందట ఇలా నన్ను ఎందుకు ఇలా అమ్ముకుంటున్నావు అని.
ఎందుకో మనసులో అది తోచింది.