ఎవరి "నయాగరా" అచ్చంగా వాళ్ళకే చెందుతుంది...

(కామెరా) వాడుకున్న వారికి వాడుకున్నంత మహదేవా! (ఫోటోలు) తీసుకున్నవారికి తీసుకున్నంత నయాగరా! సినిమా లో బ్రహ్మానందంగారు "వాడుకోండిరా..." అని సెలవిచ్చినట్లే నయాగరా కూడా బుర్రనావహించి, కళ్ళు, కాళ్ళు, సర్వాంగాలు పూర్తిగా వాడే అవసరాన్ని/అవకాశాన్ని కల్పిస్తుంది.


చాన్నాళ్ళ క్రితం చదివిన వ్యాసం లో మాట - "ఎవరో ఒక గ్రీకు తత్వవేత్త చెప్పినట్టు ఒకే నదిలో నువెప్పుడూ రెండుసార్లు స్నానం చెయ్యలేవు - ఎందుకంటే, మునకేసి లేచేటప్పటికి కొత్తనీరు వచ్చేస్తుంది కదా?" ఆలాగనే నేను చూసిన క్షణపు నయాగరా నాకే సొంతం, మరొక లిప్తలో రూపు మారిపోతుంది. నేను క్లిక్ చేసిన స్పాట్ మరొకరికి దొరకదు. అందుకే అంతా ధీమాగా చెప్పాను.

కాకపోతే 'ఇది మన నగరం మన ఆస్తి కనుక ఛార్మినార్ ని తాకట్టు పెట్టుకుని నాకు లోన్ ఇవ్వమన్న' అమాయకుడికి అక్క/చెల్లి కాను కనుక సొంతమైన దృశ్యాలు మాత్రం నేను దాచుకున్నాను.

గత 2 ఏళ్ళుగా నా బాగోగులు ఆరా తీసి విచారిస్తున్న స్నేహితుల ప్రశ్నల జాబితాలో మొదటి మూడిట్లో తప్పనిసరిగా ఒకటి - "ఫోటోలేమీ తీయలేదా?" తీయకేమి దివ్యంగా తీస్తున్నాను. "మరి పంచటానికేమి దొబ్బిడాయి?" ఇది అడగలేదు గానీ అర్థం వచ్చేలా సంకేతాలు పంపారు. అందుకే ఆల్బం పెడుతున్నానిక్కడ. కేవలం ఫోటోస్ కోసం మరొక బ్లాగు తెరిచి నడిపే ఆసక్తి లేక, ఇక్కడ/నా నియమాలని ఉల్లంఘించి పోస్ట్ చేసేస్తున్నాను. :)

1. నయాగరా/TheInnerEyeOfNiagara
2. బోనస్: నా గత 2010 ముందు, తర్వాత తోట పరిధి దాటి కాస్త పక్క వీధులకి విస్తరించిన 2011 ప్రకృతి వీక్షణం

ఇలా తిరగటం వలన దొరికిన బాతుపోరు:



నయాగరా వెళ్ళొచ్చినవారికి చూడతగ్గ స్పాట్స్ తెలిసే ఉంటాయి. ఇవి తీసి దాదాపుగా 1.5 సం. గడిచింది కనుక నా ట్రావలోగ్ లో రాసుకున్న నోట్స్ ఇక్కడ ఇస్తున్నాను. అదంతా తెలుగులోకి తర్జుమా చెయ్యనందుకు మన్నిచెయ్యండి.



The 10 places one must consider covering during the trip:
  1. World's roughest white waters flowing at speed of 22mlies/hour
  2. Whirl Pool point 120ft. deep
  3. Point of NO RETURN
  4. Maid of the Mist
  5. Cave of the Falls
  6. Hurricane Point
  7. Horse Shoe spot
  8. River side walk
  9. Goats Island
  10. Some place so unique to your eye (I am not sharing mine, but you go and figure out from my pictures’ captions) ;)
Personally, I liked these parts of my journey.
  • I went for 3-4 miles walk at 6am in the morning along the trails and spent good 3 hours to click on these rarest spots all alone
  • I got to know at least 25 people in that short journey and talk in depth of their experiences and hobbies
  • Of all the moments I spent the the best was when, I went 5ft close to the American Falls with Yuva (my son) on Sat night at 11pm and got wet under divinely showers
  • A professor from Lithuania got in touch with us and spent about 6 hours with me and Sneha (my daughter). She liked us a lot. She wanted to be in touch. (I wasn’t so sure if that excitement would ever last longer, however. And it didn’t as expected)
  • Reading Chalam's translation of Tagore’s Gitanjali all along the journey
We missed the Fireworks at the Falls as the event is scheduled on Fri and Sun nights while we were there from Saturday morning through Sunday evening. But I must say; I wasn’t disappointed having seen/witnessed the fireworks on 31st Dec in Sydney, AUZ several times as well as the 2000 Olympics related celebrations.

రసాల కిసలయం: అనగనగా మా నాన్న కథ

"...భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయటకు పెట్టి మొదట వచ్చిన రెండాకుల్ని చేతులుగా జోడించింది కృతజ్ఞతతో" - గుంటూరు శేషేంద్ర శర్మ

నాన్న గారి పట్ల ఇష్టాన్ని, ప్రేమని అంతా నవ్వేంతగా చూపగలుగుతాను కానీ కృతజ్ఞత ఇంకా పూర్తిగా చూపలేకపోయానే అనుకుంటాను.

శివరాత్రి అంటే నా వరకు ఎక్కువ గుర్తులు నాన్న గారి పుట్టినరోజు. వేగు చుక్క ని వెదుకుతూ, నది స్నానం - కళ్ళు మూస్తూ/తెరుస్తూ, జోగుతూ జాగారం. ఎప్పుడూ ఉపవాసం. అపుడపుడూ ఏకాహం. తెలియని వాళ్ళకి (కనీసం వతను తప్పకుండా చెల్లి కైనా) ఆరిందాలా తెలిసినవి చెప్పటం. తెలిసిన వారు (అంటే నాన్న గారు, మామ్మ) చెప్పినవే చెప్తుంటే వింటూనే మళ్ళీ వాళ్ళవి వాళ్ళకి అప్పజెప్పటం. మరీ ముఖ్యంగా లింగోద్బవ సమయానికి నాన్న పుట్టగానే "కేశవ" అంటూ నామకరణం చేసేసుకోవటం, తులసమ్మ కోటలో పచ్చగా విచ్చుకోవటం వంటివి. నాన్న గారి తరం లో అలా వాళ్ళ అమ్మలు పూజలు, నోములు, వ్రతాలు చేసి సంతానాన్ని కన్నాము అని చెప్పటం చాలా సహజం కానీ ఎన్నిసార్లు చెప్తున్నా అందులో వెల్లివిరిసే సంతృప్తి ఎంత చిక్కనో! మొన్న ఓసారి చెప్పినట్లే ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఆ ఒక్క రోజే తెలతెల వారకనే క్రిష్ణ లో నదీ స్నానం, ఈత కొట్టటం చేసేవాళ్లం. చలికి వణుకుతూ నాన్న గారికి జుట్టుతుడిచే పని అప్పజెప్పి గుప్పిళ్ళలోకి ఊపిరూదుకుంటూ ఎన్ని పసితనపు జ్ఞాపకాలో గుండెలో పట్టుకున్నాను. నేను హాస్టల్ లో ఉన్నపుడూ జాగారం చేసుకుంటూ, వార్డన్ సిస్టర్ కి తెలియకుండా జపమో, మంత్రమో పఠిస్తూ గడిపేదాన్ని. ఇంకొకటి ఏమిటంటే నా పుట్టిన రోజు ఆంగ్ల కాలెండర్ లెక్కల్లో తేదీ కనుక కొన్నిసార్లు శివరాత్రి లో పడుతుంది. అపుడు మరింత సంబరం. నాన్న పుట్టిననాడే నేను పుట్టాను అన్న ఊహ భలే వింత నా చిన్నతనం లో.

నాన్న గారిని గూర్చి మునుపే చెప్పేశాను ఆ నాన్న కూతురుని అన్చెప్పి. ఇది పునశ్చరణ మాత్రమే.

నాన్న చెప్పిన పాఠం నిత్య పారాయణం,
తిథి వారాలు ఎంచని ప్రతి పనిలో అదే కొలువు.
పాఠం స్వయంకృషి.

నాన్న నేర్పిన పాట నా నోట పలికింది,
కోటి గళాలై శతకోటి స్వరాలై.
భావం ఆశయసాధన.

నాన్న వేసిన బాట నాకు చెప్పింది,
పోటి పడినా వోటమి ఎదురైనా ఆగకని.
మార్గం స్థిరసంకల్పం.

నాన్న అనుభవం ఆస్తిలో నా వాటా,
ఆటుపోటు తప్పని బ్రతుకున అదే ఆలంబన.
ధనం స్వాభిమానం.

నాన్న చెప్పిన మాట జేగంట,
గుడి కాని గుడి నా గుండెలో గణగణ.
రాగం అనురాగం.

నాన్న చూపనిదేదీ నాకు అపరిచితం.
అస్థిత్వం విసిరిన సవాలుకి నా జవాబు,
నాన్న కూతురు నేనంటేనే నాకు ఇష్టం.

అలా ఎక్కువగా నాన్న గారి చేతిలో దిద్దబడిన నాకు, ఆయన నుంచి సంక్రమించిన అలవాట్ల/అభిరుచుల్లో ఒకటి తోటపని. మొక్కలు/వృక్షాల పట్ల అతి ప్రేమ. ఇప్పటికీ ఇంకా తెలియాల్సిన వృక్షజాతులు, పూలు మిగిలున్నా తెలిసినవి ఎక్కువే - తెలుసుకుంటూనే ఉన్నాను కూడా.

అందునా పిల్లలకి తెలుగునేర్పటానికి ఎంచుకున్న ఒక అంశం ఇదే కనుక ఇంకాస్త సేకరణ చేస్తున్నాను. కానీ వాళ్ళకన్నా నాకే ఎక్కువగా విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ అధ్యయనం. ప్రకృతి ప్రేమికులకి “వృక్షో రక్షతి రక్షితః” మాత్రమే కాదు వనం అన్నది మనం (మనసు) కి జీవధార.

అలా తారసపడిన ఒక పుస్తకం - మేనకా గాంధీ, యాస్మిన్ సింగ్ రచించిన 'బ్రహ్మాస్ హెయిర్' . ఇందులో మైథాలజీలో సాంప్రదాయ వృక్ష విశేషాలు, వాటి నావరించి వున్న పురాణ విశిష్టతల కథలున్నాయి. ఇదే పుస్తకం తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారు అనువాదం చేయగా సుమారు 4 సం. క్రితం విపుల లో "బ్రహ్మకేశాలు" అన్న శీర్షికన వెలువడింది. తెలిసినవారి ద్వారా వాటి ప్రతులకు ప్రయత్నించాను కానీ వారు త్వరలో పుస్తకం గా ప్రచురణలోకి తెస్తున్నారని తెలిసింది కనుక నా ప్రయత్నం విరమించాను. ఇప్పటికి ఆసక్తి ఉన్నవారు ఇక్కడ ఇంగ్లీషులో చదువుకోవచ్చు. చాలా బావుంది.

నాన్న గారికి ఈ మొక్కలు కథలవీ కొన్ని చెప్పాను, కొత్తగా చూసిన పూల వివరాలు తెలిపాను. శ్రద్దగా విన్నారు. ఆయన మరి కొన్ని చెప్పారు.

ఇపుడే శివాలయం లో అభిషేకం చేసుకుని పూజాదికార్య క్రమాలు ముగించుకుని వచ్చి, నేను వెళ్లలేకపోయినా నా తరఫున ఒక ఆత్మీయ హస్తం ఇచ్చిన సర్ప్రైజ్ కానుకని స్వీకరించి ఆనందంగా ఉన్న మా నాన్న గారు మరింత ఆయురారోగ్యాలతో శత వసంతాలు చేసుకోవాలని మనసారా ప్రార్థిస్తూ, జీవని చిన్నారులకి ఒక చిరు కానుక పంపాను . ఇది ఒక మైలురాయి జన్మ దినం కనుక ఇంతగా గుర్తు పెట్టుకుంటున్నాను.

ఈ మధ్యన వచ్చిన దూకుడు పాటలో ఒక వాక్యం నెమరేసుకుంటూ - "అన్నీ తానై ఉన్నాడు దేవుళ్ళాంటి నాన్న...కోరే వరమే లేదంటా తన సంతోషం కన్నా." అవును 'నేను - మా నాన్న' కథ నాకెప్పుడూ అనగనగా అనుకునే "రసాల కిసలయం"

కవితాప్రపంచంలోకి వచ్చిన కొత్తల్లో మనసుకి హత్తుకున్న కవితలోని పంక్తులివి.

"జీవితం రసాల కిసలయం కాదు జిల్లేడు కొమ్మ
వేధించినా క్షీర భాష్పాలిచ్చే వెర్రిబాగులమ్మ" - సి.నా.రె. (అని గుర్తు)

కిసలయం అనే వికృతి స్వరూపం కి ప్రకృతి పదం - "కిసలయించు" అంటే "చిగుర్చు"... అని అర్థం. కనుక ఆ పదప్రయోగాన్నే ఈ శీర్షికలో పెట్టాను.

(పిల్లల కోసం) భీష్మ ఏకాదశి : విష్ణు సహస్ర నామం పుట్టినరోజు

నా దగ్గర MAHABHARATA, DREAMLAND PUBLICATION పిల్లల వర్షన్, ప్రయాగ రామక్రిష్ణ గారి 'భారతంలో చిన్న కథలు' ఉన్నాయి. మీ ఎవరికైనా ఇతరత్రా పుస్తకాలు/వివరాలు తెలిస్తే పంచుకోండి, ప్లీజ్. ఇక్కడ చెప్పినా లేదూ ushaa డాట్ raani జీమెయిలు ఐడికి పంపినా సరే.

/************************************************************
ఈ ఏడాది నాన్న గారు గుర్తు చేస్తేనే సప్తమి, ఏకాదశి తెలిసేంతగా పనిలో మునిగానని కాస్త విచారించి, కనీసం ఇక్కడ పెట్టుకుంటే పై ఏడాదికి రిఫరెన్స్ అని రాసుకున్నాను.
రేపటి క్లాసు కి నా చిన్నారులు, 5-12సం. ప్రాయపు వాళ్ళ కోసమని రాసుకున్న బ్రీఫ్ నోట్స్.
*************************************************************/

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు "దేవవ్రతుడు". ఇతడు గాంగేయుడు - గంగకి శంతనునికి జనించిన అష్టమ సంతానం. తండ్రి ద్వితీయ వివాహం కొరకు భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడు గా పిలవబడ్డ ఈయనది భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర. కౌరవ పాండువుల పితామహుడు.

తండ్రి ప్రసాదించిన - తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే - వరం ఉన్నందున, కురుక్షేత్ర సంగ్రామం లో (పాండువుల శ్రేయస్సు కోరి, విజయమాశించి, తన పరాజయ/అస్త్రాన్ని అడ్డగల కారణం చెప్పి, శిఖండి ని అడ్డం పెట్టుకున్న అర్జునుని చేత శరాఘాతుడై) అంపశయ్య మీద ఉత్తరాయణం వేచి ఉన్న భీష్మాచార్యుడు రథ సప్తమి మొదలుకుని ఏకాదశి వరకు, రోజుకొక ప్రాణాన్ని త్యజిస్తూ, ఈ భీష్మ ఏకాదశి (మాఘ శుద్ధ ఏకాదశి ) నాడు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని, ఆ మహత్యాన్ని తెలియచేసి, ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.