నా కళ్ళతో చూసిన - Walt Disney World Resort Where Dreams Come True

తను కనే ప్రతి కల నిజమౌతుందని విశ్వసించిన వాల్ట్ డిస్నీ ప్రపంచంలో విహరించి వచ్చాను. ప్రతి శనివారం తన ఇద్దరు కుమార్తెలతో గడుపుతూ విధంగా పిల్లలు, తల్లి తండ్రులు కలిసి సరదాగా గడిపే ఏర్పాటు చెయ్యాలా అని ఆయన చేసిన యోచన, కన్నా కలలకి ప్రతి రూపమే వాల్ట్ డిస్నీ వరల్డ్. ఆయన మీద లఘు చిత్రం ఒకటి వుంది. బాగా చిత్రీకరించారు.

సెలవులకి వెళ్లిరా అని సాగనంపిన మిత్రులదరికీ ఇదే నా పలకరింపు. ఇవాళే మధ్నాహ్నం మూడుకి ఇంటికి చేరాను. మునుపెప్పుడో పది, పదిహేనేళ్ళ క్రితం సికింద్రాబాదు నుండి గౌతమిలో కాకినాడకి, అక్కడ నుండి కార్లో ద్రాక్షారామం, కోటిపల్లి, తర్వాత పంటి మీద ముక్తేశ్వరం కి వెళ్లి , అక్కడ నుండి అయినవేల్లంక వెళ్లి తిరిగి అదే దారిలో వచ్చినట్లు విహారమూను.

ఎక్కడికి వెళ్ళానో చెప్పేసాగా? క్లుప్తంగా కొన్ని కబుర్లు. నాకు యాత్రల్లా వివరించటం రాదు. నాన్న గారికి వ్రాసినట్లే ఇక్కడ వ్రాసేస్తున్నాను. మీకు నచ్చితే ఓకే :) నచ్చకపోయినా ఓకే... ;) చూసిన వారికి సారి రిఫ్రెష్. చూడని వారికి కాసింత కాలక్షేపం.

పని రోజు హడావుడిగా సర్దుకోవటం. కామెరా ఒక్కటే నాకు ముఖ్యం. పనిచేసేసా..

బుధ వారం ఆఫీసు నుండి వచ్చి ప్రయాణం..ప్రక్క ఊరికి గంటన్నర డ్రైవ్ ...

అక్కడ నుండి విమాన ప్రయాణం. మధ్యలో అట్లాంటా లో మారటం, ముందుది ఆలస్యం గా వెళ్ళింది ఎలాగా అనుకున్నా రెండో దాన్ని అందుకోలిగాము. అర్థ రాత్రికి ఫ్లారిడా రాష్ట్రం లోని ఒరలాండోకి చేరాము. మాకు వూరు గాల్లో ఏడు వందల మైళ్ళు దూరంలో వుంది. హోటల్కి టాక్సీలో తీసుకువెళ్లి ఆడం చక్కగా మా పేరు వ్రాసివున్న నేమ్ కార్డ్ తో సిద్దం. కబుర్లతో అరగంట ప్రయాణం డాల్ఫిన్ హోటల్ కి. తను మొరాకో దేశస్థుడు. ఇండియాకి ముంబై, పంజాబ్ చూడటానికి వచ్చాడుట. మాది ఏడో అంతస్తులో గది. చక్కని వ్యూ. రూం నెంబర్ అంకెలన్నీ కూడితే ఒకటి వస్తుంది. అలాగే వుంది. :)

ఆవురావురుమని డిన్నర్ తిని పడుకునేసరికి రాత్రి మూడై పోయింది.

ఉదయాన్నే లేచి ఫెర్రీలో ముందుగా ఎప్కాట్ పార్క్ కి ప్రయాణం. దార్లో బోర్డ్ వాక్ అలా అలా చూసాం.

ఎప్ కాట్ విశేషాలు: అక్కడ ఫ్లైట్ ట్రైనింగ్ లో నేను కమాండర్, పిల్ల పైలట్ మరొక అమెరికన్ ఇంజినీర్. మొత్తానికి మార్స్ చూసివచ్చాము. :) తర్వాత స్పేస్ షిప్ యర్త్ లో భావి ప్లాన్స్ వేసుకున్నాము. అలాగే వేస్ట్ మానేజ్మెంట్ గురించి తెలుసుకుని చాలెంజ్ తీసుకుని నెగ్గాము. ఎనర్జీ సేవింగ్స్ కూడా ఒక ఆట గా తెలుసుకున్నాము.

అక్కడ నుండి హాలీవుడ్ స్టూడియోస్ వెళ్ళాము. కాస్త అటూ ఇటూ తిరిగి రూమ్కి చేరాము. కాసేపు విశ్రాంతి. టాక్సీలో ఇండియా భవన్ కి డిన్నర్కి తీసుకుని వెళ్ళిన మహమ్మద్ కూడా మొరాకో వాడే ఆడం కి దోస్త్. మాకూ ను ఇప్పుడు. :) నూట ముప్పై మిలియన్ల జనాభా గల దేశం నుండి వచ్చే వాళ్ళకి లాటరీ ద్వారా గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇతనికి హింది సినిమాలు ఇష్టం. షారూఖ్, అమితాబ్ ఇష్టం. మర్నాడు రాత్రి డిన్నర్ కి వుడ్లామ్డ్స్ కి కూడా ఇతనే తీసుకువెళ్ళాడు. ఇతను మూడు ఉద్యోగాలు చేస్తున్నాడు. మన దేసస్తులంటే గౌరవం.

హాలీవుడ్ స్టూడియోస్ కబుర్లు: టాయ్ స్టోరి మేనియా ఆట, నార్నియా మేకింగ్ చూసి అలా అలా కాస్త తిరిగి స్ట్రీట్ షోస్ , స్టేజ్ పేర్ఫార్మంసేస్ చూసి మాజిక్ కింగ్డం పయనం అయ్యాము. అంతా జన సందోహం. రక రకాల వేష భాషలు. సరదాలు, సంబరాలు. పార్క్ చివర్లో రెండు వరసల్లో చేతులు పైకి కట్టి నిలుచుని సందర్సకులకి ఉత్సాహం కలిగిస్తూ చిన్న నృత్య ప్రదర్శనగా వీడ్కోలు ఇచ్చిన యూరోపియన్ బాండ్తో నేనూ కాస్త అడుగులు కలిపాను.

మాజిక్ కింగ్డం వింతలు: ఇది పిల్లలకి విపరీతం గా నచ్చే పార్క్. ఇక్కడ చాలా వింత వింత ఆటలు. మేము అల్లాద్దీన్ మాజిక్ కార్పెట్, మాడ్ టీ పార్టి, కార్ రేస్, బార్న్ యార్డ్ డిసాస్తర్ రైడ్స్ ఎక్కాము. చివరిది, ఒక సన్న ట్రెయిన్ గాల్లోకి పైకి యాభై అడుగులు తీసుకుపొయ్యి వేగంగా మెలికలు తిప్పుతూ క్రిందకి తెస్తుంది. మేము ఎక్కేసరికి చంద్రుడు వచ్చేసాడు. నాకైతే తనని తాకి వచ్సినాట్లనిపిమ్చిమ్ది. పాలస్ సెట్టింగ్ చూడ్డానికి కళ్లు చాలవు. పైగా అక్కడే మిక్కీ, మిన్నీ, డోనాల్డ్ ఇంకా అందరి ప్రదర్శనలు. వాహ్వా ఆనందం.. చెప్పనే చెప్పను.

ఇంకా అలాగే తిరుగుతూ కనపడిన విశేషాలు చూస్తూ, తింటూ, గిఫ్ట్స్ కొనుక్కుంటూ రాత్రి వరకు గడిపాం.

మూడో రోజు మాకు చివరి రోజు. బాగా విశ్రాంతి తీసుకుని మంచి శక్తి పుంజుకుని బయల్దేరాం. చివరి మజిలీ యానిమల్ కింగ్డం. అన్నిటి కన్నా పెద్ద పార్క్.

దార్లో దిగలేదు కాని ప్రపంచంలో అతి పెద్ద ౧౨౦ అడుగుల వాటర్ స్లైడ్ వున్న పార్క్ మీదగా బస్సులో ప్రయాణం.

యానిమల్ కింగ్డం లో చూసినవి: అన్నిటికన్నా పెద్ద పార్క్ ఇది. వాటర్ రాఫ్ట్ ఎక్కాము. ముద్ద ముద్ద తడిసి అవి ఆరే దాకా జంగిల్ పార్క్ లోనడక. ఇది ఏసియన్ థీమ్. తర్వాత ఆఫ్రికన్ థీమ్ పార్క్ లో డాన్స్ చేసాక [నేనే :) ] పాత కాలపు నాటి రైలుఎక్కాము. ఇక్కడే ట్రీ ఆఫ్ లైఫ్, ఎక్పిడిషన్ మౌంట్ ఎవరేష్ట్ వంటివి చూసాము.

మూడో రోజు రాత్రి మమ్మల్ని డిన్నర్కి తీసుకు వెళ్ళిన టోనీ పోర్టో రికో దేశస్తుడు. వీరికి ఈ దేశపు పౌరసత్వం వుంది. నూట ఇరవై చదరపు మైళ్ళ ఆ దేశంలో నాల్గు మిలియన్ల జనాభా. ఆతను నా మాదిరిగానే రిటైర్ అయ్యాక స్వదేశం పోవాలని కలలు కంటున్నాడు. టోనీ కజిన్ ఇండియన్ని పెళ్లి చేసుకుంది. ఈ మధ్యనే న్యుజెర్సీకి వెళ్లి ఆమె ఇచ్చిన కలగలుపు వంటలవిందు ఆరగిమ్చివచ్చాడుట. జై భారత్!
నాలుగో రోజు ఉదయం ఎయిర్ పోర్ట్ కి తీసుకుచ్చిన మార్తా స్పానిష్ స్త్రీ. నలుగురులోకి కత్తివంటి డ్రైవింగ్ తనదే :)

తిరిగి విమానం మళ్లీ కార్ లో ఇంటికి చేరాం.

ఆపై ఎక్కడకి వెళ్ళినా పది మంది నైనా గమనిమ్చటం ఏదో ఒక జ్ఞాపకం పోగేయటం అలవాటు.

. మొదటి విమానం లో విపరీతంగా తాగి [బిజినెస్ క్లాస్ కనుక మితం లేకుండా డ్రింక్స్ అడిగాడు] అల్లరి చేసిన యువకుడు. మా ప్రక్క సీట్ఇతనిది. కానీ విసుక్కోవాలనిపిమ్చలేదు. థాంక్స్ గివింగ్ హుషారులోవున్నాడు. అరుపులే అరుపులు.

. ఎక్కిన దగ్గర నుండి తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ, ఇక దిగుతాననగా మేకప్ వేసుకుంటూ డాన్స్ చేసిన యువతి. తనూ పైవాడి పరిస్థితిలోనే వుంది. కాస్త నవ్వులు చిలికి మాకూ పంచింది.

. పార్క్ లో కాదు వృద్ద జంట. ఒకరికొకరు సాండ్ విచ్ తినిపిమ్చుకుమ్టూ - భలే ముచ్చట గొలిపారు.

. ఒక భారతీయ బాబుని దత్తతకి తిసుకున్నారల్లే వుంది. అమెరికన్ తండ్రి వాడిని భుజాలమీద ఆడిస్తూ కనపడ్డాడు. తల్లీ అమెరికన్.

. పిల్లలకి నచ్చని పని చేయించావు, నాకది నచ్చలేదు అని తండ్రి నాకు నచ్చిన పనే నేను చేస్తాను అని వాదిస్తూ తల్లి. కుటుంబ గాధ ఇది.

. తల్లిని వీల్ చెయిర్ లో తోసుకుంటూ తండ్రి కీ చేయి అందిస్తూ కొడుకు. చక్కని దృశ్యం.

. మనవరాలిని విసుక్కుంటూ కూతురితో నో స్మోకింగ్ పార్క్స్ నాకు నచ్చలేదు అని అంటున్న అమ్మమ్మ.

. ఒక్కత్తే ముగ్గురు పిల్లలతో వచ్చిన యిస్ట్ యురోపియన్. భాష కూడా సరిగ్గా రాదు. నేను వీళ్లకి ఒక ఫోటో తీసాను.. ఒక ఉమ్మడి చైనీస్ కుటుంబం. కాస్త చూసి లెక్కగా ఖర్చు పెట్టుకుంటూ..

౧౦. చక్కటి పడుచు జపనీస్ జంట.;) నా కవితకి తగ్గ వలపు వస్తువు అందిస్తూ. అధరామృత సేవల్లో లోకం మరిచిపోతూ..

చివరగా మా అలవెన్స్ నుండి నేను గొలుసు, జాకెట్ కొనుక్కుని స్పా కి వెళ్తే, పిల్లది కూడా నా కన్నా నాలుగాకులు ఎక్కువ  
చదివింది.

గద్దర్ వస్తే ఇక్కడ పాడుకునే పాట:

బస్సేనక బస్సు వచ్చే
బస్ నిండా జనమూ వచ్చే పార్క్ చూసిన నరుడా
నను నమ్ము మస్తు మందే

పార్క్ అంతా ఒక ఫాంటసీ ప్రపంచం వలె వుంది. చక్కని సౌకర్యాలు. పిండి కొద్దీ రొట్టె మాదిరే. బస్, ఫెర్రి , మోనో రెయిల్ ప్రయాణాలు, చక్కని వసతులు, సెక్యురిటి. దాదాపు నలభై ఆరు చదరపు మైళ్ళ పొడవుగా విస్తరించిన ఈ వరల్డ్ లో వంట్లో శక్తి, చేతిలో డబ్బు, సమయం వుంటే వినోదానికేమీ కొదవ లేదు.

ఇక ప్రకృతి పరంగా ఎన్నో అందాలు. అవని తల్లీ నీకు అభివందనం అనుకోని అడుగు లేదు. పూలు, చెట్లు, పక్షులు, నీళ్ళు అన్నిటా అందమే.

అనుకోనిది ఈ ప్రయాణం ఒక అందమైన అనుభవం. ఆహ్లాదకరమైన జ్ఞాపకం. మరొక్కసారి ఫోటోల  లింక్: 
https://plus.google.com/photos/112283300174396077528/albums/5409670705528296481?banner=pwa

సెలవురోజులొచ్చాసాయే బ్లాగు!

మరువం తాత్కాలిక విరామం తీసుకోనున్నదిక. వారం "థాంక్స్ గివింగ్" సెలవులు కనుక కాస్త బయట గాలిపీల్చుకోను వెళ్తున్నాను, ఆపై వృత్తిపర విషయమై తీరిక చిక్కదు కనుక తిరిగి పై శనివారం వరకు గప్ చుప్. ;)

విందులు [
టర్కీ , మాష్ పొటేటో, గ్రేవి, యాపిల్ పై వగైరాలు] వినోదాలు [స్నేహితులు, బంధువుల సమక్షం లో, సినిమాలు] లేదూ షికార్లు, విహార యాత్రల్లో [మా బాపతు] , ఊహు ఇవేమీ కాదు మాకు "షాపింగ్" పిచ్చి కనుక "బ్లాక్ ఫ్రై డే" చాలు అని - ఈ సెలవులు గడిపే అందరికీ ఆనందం, ఆహ్లాదం కలుగాలని మనసారా కోరుకుంటూ... ఇండియాలో, ఇతర ప్రదేసాల్లోని వారికి కూడా అవి చేకూరాలని ఆశిస్తూ...

తిరిగి విశ్వామిత్ర-౧౨ టపాతో డిశంబర్ ఐదారు తారీఖుల్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ ...

మీ నేస్తం,
మరువం ఉష.