ఎవరో రావాలీ ఈ జానపదమును పూరించాలీ...

ముందు మాట: పోయినేడాది వేసవి రోజు ప్రొద్దుప్రొద్దున్నే అంటే సుమారు ఎనిమిది గంటల సమయంలో లేత ఎండలో తడుస్తూ [విడ్డూరమే మరి!] లేలేత తోటకూర త్రుంపుకుంటున్న వేళ వచ్చారు అంకులు గారు. 'ఇదేమమ్మా అప్పుడే లేచావే?' అనుకుంటూ. అలవాటండి అన్న నా సమాధానంతొ మొదలైన మా సంభాషణ, 9:30కి ముగుస్తుందనగా 'మా నాన్న పాడేవారూ అంటూ ఆయన పలికిన పదమిది. కాని ముందు వరసలు మరచిపోవటంతో నాకు తృప్తిగా అనిపించక తోచిన యత్నాలు చేసినా పూరణ దొరకక మీ ముందు వుంచుతున్నాను!
*********************************************************************
అసలు మాట: "..... నుదుట గల భాగ్యరేఖయు మసి బొట్టా తుడిపివేయను మానవ నాధ!"
*********************************************************************
అదండీ నా సమస్య. కనుక బ్లాగుశయులార! తెలిసిన యెడల కాస్త చెప్పి పుణ్యంకట్టుకోరూ? చిన్న వివరణ ఏమంటే, ఇది వరంగలు ప్రాంతానికి చెందిన పాట కావచ్చు.

మనసులో మాట: మునుపు ఏమి వ్రాయలన్నా నాకు ముందే సిరివెన్నల గారో, ఆరుద్ర గారో ఆఖరుకి కలల్లో నేనేవాడేసిన వైనంగా వుండేది. ఇప్పుడేమో బ్లాగరు మిత్రులు కోవకి చేరిపోయారు. అవునూ, ఇంత కాలం ఆనందం నేనెందుకు మిస్సయ్యనూ? :) ముందే చెప్పాను కదా, పదాలు దొరకక అక్కడా ఇక్కడా అరువు తెచ్చుకుంటున్నానని.

మరపు రాని మరో రోజు

http://kottapali.blogspot.com/2008/05/blog-post_26.html లొ చెప్పినట్లుగా, మళ్ళీ మళ్ళీ గుర్తుచెసుకోవాలి!

నేను ఈ గడ్డపై అడుగిడిన రోజు, తెలియకనే సైనికురాలిగా మారానని తెల్సిన రోజు. ఎన్నో రొజుల్లా ఈ రోజు వచ్చిపోతున్నా, ఇంకా సమరం సాగిస్తూనేవున్నాను కనుక తిరిగి శంఖంపూరించే రోజిది. తోటి సిపాయి కొరకు చుట్టూ చూస్తూ, కలిసిన మనిషికి వుండాల్సిన లక్షణాలన్నీ తన లక్ష్యసిద్ధికి ఒకటొకటిగా మరుగై, మరుపై, మసకై ఎక్కడొ మనసు మూలల్లో చిన్న మచ్చలుగా మిగిలుంటే, కలల ఎండలో సాగిన నీడల్లా దర్శించుకుంటూ కరకు గుండెకై సాధన కసరత్తులు చేస్తూనే సాగనంపానీరోజుని...

కోడిగుడ్డు పులుసు వుడికిస్తూ కొంచం, palak paneerకి పోపువెస్తూ మిగిలిన సగం 1936లో విస్వనాధవారు వ్రాసిన "మాక్లీ దుర్గంలో కుక్క" కథ తెలుగునాడిలో చదవటం నాకీ రోజుకి పండుగ పర్వం!

సంతోషానికి కొలమానం ఏది?

ఏంటి చెప్పు మరి ఎంత సంతోషంగా వుంది? అని అడిగినప్పుడు నా దగ్గర సమాధానంకన్నా ప్రశ్నలే వున్నాయనిపించింది ఎందుకో మరి.

సంతోషం నా మనసుకి సంబంధించిన భావం! అది అందించే అనుభూతి అంతే. దానికి మూల కారణం నేను పెట్టుకున్ననిర్వచనం, ప్రమాణం నేను పెట్టుకున్నదే, మరి ఒక్క ప్రశ్నకీ ఇతరుల కొలమానం ఎలా వాడగలను? నాకు వాళ్ళడిగిన క్షణం అలా వున్నదని కానీ, సమాధానం చెప్పలేనని కానీ ఎలా చెప్పను?

మొదటి మాట

వాడినా వాసన వీడని మరువం ... విశేషణం అన్నిటికీ వర్తిస్తుంది కదా! తిరిగి మేల్కొన్న నాలోని తృష్ణకి కూడాను...