tag:blogger.com,1999:blog-4302185437921795709.post239594843047981457..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: అష్టాచెమ్మా/కర్రాబిళ్ళ/చార్ పత్తర్ .. (కోచింగ్ ఇవ్వబడును, పిల్లలు/పంతుళ్ళు కావలెను)మరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-68840558272546748132016-06-14T22:38:02.645-05:002016-06-14T22:38:02.645-05:00Thanks for reminding me my childhood games. At the...Thanks for reminding me my childhood games. At the age of 63 I still cherish all these games once I played during my childhood at Rajahmundry. I was champion of Daadi aatta, Ashta chemma, Chintapikkalaata in our locality.Anonymoushttps://www.blogger.com/profile/15638293085463551782noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-5416642955598779492010-06-14T11:23:35.420-05:002010-06-14T11:23:35.420-05:00ఇక్కడ వాడిన చిత్రాలు లింక్స్ తెగిపోయాయి [అనుకోకుండ...ఇక్కడ వాడిన చిత్రాలు లింక్స్ తెగిపోయాయి [అనుకోకుండా ఆల్బం ప్రాపర్టీస్ మార్చటంతో]..తిరిగి సర్దాను..అసౌకర్యానికి మన్నించండి.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-81619117569700744232010-05-31T18:02:54.535-05:002010-05-31T18:02:54.535-05:00జడ కోలాటం: అమెరికాలో ఉన్నవారికి - సిలికానాంధ్ర వార...జడ కోలాటం: అమెరికాలో ఉన్నవారికి - సిలికానాంధ్ర వారి వీడియో కాక, "ఉయ్యాల జంపాల" డివిడి అందుబాట్లో ఉంటే "అందాల రాముడు ఇందీవర శ్యాముడు. ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు" పాట చిత్రీకరణ కూడా ఒక వనరు.

తెలిసిన వారు మరి కొన్ని ఆటలు/క్రీడలు సమాచారం పంచండి, ప్లీజ్! :)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-14736322840963305262010-05-30T20:14:14.047-05:002010-05-30T20:14:14.047-05:00గ్రామీణ క్రీడలపై విలువైన జ్ఞాపకాలు, సమాచారం పంచుకు...గ్రామీణ క్రీడలపై విలువైన జ్ఞాపకాలు, సమాచారం పంచుకున్న అందరికీ మరోసారి ధన్యవాదాలు. ముఖ్యంగా సిరిసిరిమువ్వగారికి, మాలాగారికి - తర్వాతి తరం, దాని తర్వాతి తరంలో జీవిస్తూనే ఉన్నాయీ ఆటలని చూపినందుకు..నేను వచ్చి ఉండే ఆ నాల్రోజుల్లో నాకు తారసపడలేదవరూ పల్లెటూరల్లో కూడా - అంతా చదువులు, వీడియో గేమ్స్, టివి వగైరాలకి అతికిపోవటమే కాని. అవన్నీ ఎలాగున్నా ఇప్పుడు ఈ టపాని మాలతి గారి "బాలతూలిక -బ్లాగులింకులు" [http://tethulika.wordpress.com/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%82%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/ ] కలిపారు కనుక మరొక్కసారి ఇక్కడి సమాచారాన్ని చూసి మార్చే అవసరం కలుగుతుందేమో!

నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-57233693196805271012010-05-22T11:22:21.930-05:002010-05-22T11:22:21.930-05:00మాలాగారు, అన్నీ మన చేతుల్లోనివాండీ, జరిగేవాటిని క...మాలాగారు, అన్నీ మన చేతుల్లోనివాండీ, జరిగేవాటిని కళ్ళెట్టుకు చూసి, మనసూరుకోనపుడు ఉసూరుమని ఇలా గోలపెడతం తప్పా :) నా రచన, మీ స్పందన అంతా మిథ్య. కాలపుతీరు అంతే! పారిపోయారా? మళ్ళీ మరువం వైపు రారిక.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-57145143943805240142010-05-21T09:50:00.075-05:002010-05-21T09:50:00.075-05:00మూడు రోజులైనా , మీ ఈ పోస్ట్ ఇంకా నా స్మృతులను తట్ట...మూడు రోజులైనా , మీ ఈ పోస్ట్ ఇంకా నా స్మృతులను తట్టి లేపుతునేవుంది . ఈ రోజే మా పిన్ని కి పోన్ చేసి చెడా మడా తిట్టేసాను . ఎందుకంటారా , నా చిన్నప్పుడు , బహుషా ఐదారేళ్ళుంటాయేమో , సెలవల్లో మా పిన్ని అత్తవారి వూరికెళ్ళాను . అప్పట్లో నేను మా పిన్ని కి తోకను లెండి . వాళ్ళ అత్తగారు , నన్ను , నా ఆటలను చూసి ముచ్చట పడి , ఆవిడ చిన్నప్పటి బొమ్మల పెట్టి నాకు ఇచ్చారు . ఎంత బాగుందో ! చెక్కపెట్టి లో బొమ్మల పెళ్ళికి పనికి వచ్చే బొమ్మలు , సామాగ్రీ అంతా వుందన్నమాట అందులో . నేనూ పిన్ని , అమ్మమ్మా వాళ్ళింటికి వెళ్ళేటప్పుడు , బస్ లో వళ్ళో ఐతే ఎక్కడైనా పడేసుకుంటానని , నేను ఏడ్చి రాగాలు పెడుతున్నా వినకుండా ఆ పెట్టి పరుపు చుట్టలో పెట్టి , బస్ టాప్ మీద భద్రంగా పెట్టించింది .( పాపం అనుకుంది ) . మేము విజయవాడలో బస్ దిగేసరికి ఆ పరుపుచుట్ట ఎవడో దింపేసుకున్నాడు ! ఇన్ని సంవత్సరాలైనా మా పిన్ని ని బామ్మగారిచ్చిన నా బొమ్మల పెట్టి పారేసావు అని గుర్తొచ్చినప్పుడల్లా సాదిస్తునే వుంటాను . అదో , మళ్ళీ నా బొమ్మల పెట్టి గుర్తు తెచ్చారు . అంతే ఈ రోజు మళ్ళీ ఫోన్ చేసి మరీ మా పిన్ని తో గొడవ పెట్టుకున్నాను . ఎలావున్నావు పిన్ని అని అడగకుండా ఈ సాధింపులేమిటే .ఇంకా ఎన్ని ఏళ్ళు సాధిస్తావే అని తనూ అరిచిందనుకోండి .
ఏమిటో ఉషా మీరు ఇలా వుండీ , వుండీ నన్ను హిప్నటైజ్ చేసి భూతకాలానికి పంపుతున్నారు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-36826251786503360052010-05-21T07:10:44.677-05:002010-05-21T07:10:44.677-05:00నిజానికి ఈ టపా రాసాక నేను గ్రామీణ క్రీడలకి ఆలవాలమై...నిజానికి ఈ టపా రాసాక నేను గ్రామీణ క్రీడలకి ఆలవాలమైన పల్లెటూర్లలో ఇంతవరకు నా జీవితకాలంలో గడిపిన సమయం అంతా కలిపి కొద్ది రోజులే అన్నది గుర్తుకు వచ్చింది. సం. లో ఏదో ఒక పండుగ [సంక్రాంతి ఎక్కువగా] + వేసవిలో కొద్ది రోజులు. మిగిలిన కాలమంతా ప్రాజెక్ట్ కాలనీల్లోనో, కాన్వెంట్ చదువుల్లొనే.. కానీ ఇక్కడ సంగతి - అవెంత ప్రభావం నా మీద చూపాయి, నేను తర్వాతి తరానికి అందించగల సావకాశం, సదుపాయం, సమయం, ఆసక్తి వగైరాల మీద. మీరంతా కూడా వీటిని పదిలపరచమనే మనవి.

తృష్ణ, నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-45920626062042366702010-05-20T05:54:04.743-05:002010-05-20T05:54:04.743-05:00ఎన్ని జ్ఞాపకాలని తట్టిలేపారండీ...నేనూ గవ్వలనూ,చింత...ఎన్ని జ్ఞాపకాలని తట్టిలేపారండీ...నేనూ గవ్వలనూ,చింతగింజలనూ ఇంకా దాచుకున్నాను...గవ్వల బదులు గచ్చకాయలతో గులకరాళ్ళతో కుడా ఆడేవాళ్ళం.ఆ ఐదు గులకరాళ్ళనూ కూడా ఇంకా భద్రంగా దాచుకున్నాను..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-65536397672204420252010-05-20T00:02:26.090-05:002010-05-20T00:02:26.090-05:00మాలాకుమార్ గారు, మూడో తరానికి ఈ ఆటలు అందాయని ఋజువ...మాలాకుమార్ గారు, మూడో తరానికి ఈ ఆటలు అందాయని ఋజువు చూపినందుకు ధన్యవాదాలు.

లలిత గారు, సగం చెప్పి వదిలిమ్ది అందుకే మీ నుంచి మిగిలిన సగం రాబడదామని. నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-15622204231297337692010-05-19T11:06:37.705-05:002010-05-19T11:06:37.705-05:00ఉషాగారూ,
ఎప్పుడో ఙ్ఞాపకాలలోకి జారిపోయిన అందమయిన...ఉషాగారూ,
ఎప్పుడో ఙ్ఞాపకాలలోకి జారిపోయిన అందమయిన సంఘటనలను మీ టపాతో తట్టి లేపారు. ఒక్కొక్కటీ నెమ్మదిగా, ఒకదాన్ని తోసుకుని మరొకటి తొందరగా, అన్నీ కలిసిపోయి చిందరవందరగా, మనసొక్కసారిగా తట్టుకోలేనంతగా కదిలిపోయింది. నన్ను నేను సర్దుకుని క్రమంలో గుర్తు తెచ్చుకుందుకు ప్రయత్నించాను. సీలు వేసిన ఙ్ఞాపకాలపెట్టెని తాళం పగలగొట్టి మూత తీసి ఆతృతగా పెట్టెలో చేయి పెడితే అచ్చంగా భావనగారి లాగే నాకూ అనిపించింది. చిన్నతనంలో ఆడుకున్నప్పుడు తగిలిన దెబ్బలు అప్పుడు తేనెటిగ కుట్టినట్టు మంట పెడితే, ఇప్పుడు ఆ ఙ్ఞాపకాలు తేనె తిన్నంత తియ్యగా వున్నాయి.
అందరిలాగే సెలవులకి అమ్మమ్మగారి వూరు వెళ్ళినప్పుడు చుట్టాల పిల్లలందరం కలిసి ఆడిన ఆటల్లో నాకు చాలా ఇష్టమైన ఆట "కోతికొమ్మచ్చి." ఆ ఆటలో ఎన్నిసార్లు దెబ్బ తగిలినా సరే ఆ ఆట ఆడడానికే ఎప్పుడూ నా వోటు.
ఇంకో ఆట "కుంటాట" అని ఆడే వాళ్ళం. ఒక కాలు పైకి మడుచుకుని ఒకే కాలితో కుంటుకుంటూ ఎవరినైనా ఔటు చెయ్యడం.
మరో ఆట "కళ్ళగ్గంతలు". పంట లేసుకుని దొంగ అయిన వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టేసి వాళ్ళు చేతులతో తడుముకుంటూ పట్టుకుందుకు వస్తుంటే వెనకాల్నించి "జెల్లకాయ" కొట్టి ఇంకా ఏడిపించడం. అప్పుడు తెలీలేదు కాని ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది.. యేమనంటే.. ఎదుటి మనిషి ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించడమన్నది మనిషికి నేచురల్ టెండెన్సీ యేమోనని..
ఇంట్లో కూర్చుని ఆడే ఆటల్లో అందరిలాగే నేనూ చింతగింజలూ, గచ్చకాయలూ లో ఛాంపియన్ ని. ఎన్ని గుర్రాలు సేకరించేదాన్నో.
"జోర్ బాల్" అని ఒక ఆట ఆడేవాళ్ళం. సరిగా గుర్తు లేదు కాని అందరూ రౌండ్ గా వుండి మధ్యనున్న దొంగ ని బాల్ తో కొట్టడానికి ప్రయత్నించేవారు. మధ్యనున్నవాళ్ళు ఆ దెబ్బలు తగలకుండా తప్పించుకుందుకు ప్రయతించేవాళ్ళు.
ఇంకో ఆట వుండేది.. అదే "చాకలిబాన ఆట" అనే వాళ్ళం. అందరూ గుండ్రంగా కూర్చుంటే ఒక్కళ్ళు చుట్టూ తిరుగుతూ, తెలీకుండా ఎవరి వెనకైనా రుమాలు వెయ్యాలన్న మాట. "అందాలరాముడు" సినిమా లో చూపించారు కదా.. అదన్నమాట.
ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎన్ని గుర్తు వస్తాయో.
ఇవి కాక మా అంతట మేము కల్పించుకుని ఆడినవి బోలెడు ఆట లున్నాయి.
ఈ ఆటల్ని గుర్తు పెట్టుకుని తరవాతి తరానికి అందించాలన్న మీ అభిలాష హర్షణీయమే.
ఇంకా ఏమైనా గుర్తొస్తే చెపుతాను.
ఒప్పులకుప్ప పాట నాకు గుర్తున్నంత వరకూ.
ఒప్పులకుప్ప వయ్యారి భామ
సన్న బియ్యం చాయ పప్పు
చిన్ని మువ్వ సన్న గాజు
కొబ్బరికోరు బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ నా మొగుడు సీపాయ్
రోట్లో తవుడు నీ మొగుడెవరు...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-41470015980452113232010-05-19T01:10:44.632-05:002010-05-19T01:10:44.632-05:00ఉషా ,
మళ్ళీ రింగులు తిప్పించారు . మా అమ్మమ్మా వాళ్...ఉషా ,
మళ్ళీ రింగులు తిప్పించారు . మా అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో ఒక గదిలో నేల మీద పచ్చీస్ గళ్ళు గీయించి వుండేవి . ఇహ అచ్చంగాయ లైతే కోడూఊరు నుండి మా పిన్ని ప్రత్యేకం గా తెచ్చి ఇచ్చేది . బొమ్మల పెళ్ళిళ్ళకు దర్జీ సాయెబు దగ్గర బట్ట ముక్కలు తెచ్చు కోవటానికి ఎంత కాంపిటీషనో ! ఎంత హంగామాలో ! తాటాకు బూరలు , చింతచిగురు పప్పు , కాగితం బుట్టలు , అబ్బో వేసవి ఎలా గడిచి పోయేదో తెలిసేదికాదు .
మా గ్రాండ్ చిల్డ్రన్స్ తో అష్టా చెమ్మా , కో కో , వైకుంఠపాళి , ఆదతాను . ఈ మద్య వైకుంఠ పాళిలో వోడిపోయాడని , ఆ పేపర్ చింపేసాడు మా చిన్నోడు . ఎంతైనా అబ్బాయిలు అల్లరోళ్ళు సుమా .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-48600802775801047552010-05-19T00:10:38.675-05:002010-05-19T00:10:38.675-05:00"వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి?" వ..."వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి?" వీరి పేరు "కమ్మని బాల్యం" :) స్పందనలు, సమాచారం పంచుకున్న అందరికీ కృతజ్ఞతలు. అమ్మ చేతిముద్ద కమ్మన, అలాగే ఈ ఆటలన్నీ మనసుకి సాంత్వన ఎప్పటికీను. అమ్మమ్మ తోనో, మేనత్తతోనో ఆడే "అష్టాచెమ్మా" ఒక ఇంటి ఆప్యాయతలు, అనురాగాలు గుర్తుకి తెస్తే, వీధుల్లో ఆడే కర్రాబిళ్ళా, కావాలన్నది దక్కించుకోవాలన్న ఆశ, గెలవాలన్న పట్టుదల, ఓడిపోతున్న ఉక్రోషం, ఇలా కలగలుపు భావావేశాలకి మనసుని సిద్దం చేస్తుంది. ఇక ఆ చార్ పత్తర్ వంటి ఆటలు ఒక స్ట్రాటజీతో ఒక టీం గెలవటానికి కావాల్సిన ఎత్తులు రుచి చూపుతుంది. అందుకే ఆ మూడు శీర్షికకి వాడాను. ఇలాగే ప్రతి ఆటకీ ఓ అర్థం, పరమార్థం వెదకొచ్చు కదా. పైగా ఇవన్నీ జీవమున్న స్మృతులు. ఎప్పుడు నెమరేసినా తీయనే. మన మూలాల్నీ, మనవారితో అనుబంధాలనీ కలిపి పేనే పడుగుపేకలివి.

నిజానికి ఒక్కొక్కరికీ విడి సమాధానం ఇవ్వాలనున్నా సమయాభావం వలననే ఇలా క్లుప్తంగా రాస్తున్నాను. సమయం అనుకూలిస్తే మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తానిక్కడ. నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-42905237086705711562010-05-18T18:07:56.118-05:002010-05-18T18:07:56.118-05:00చక్కని తెలుగు వారిగా పుట్టటం, ఈ ఆటలన్నీ ఆడుకోవటాని...చక్కని తెలుగు వారిగా పుట్టటం, ఈ ఆటలన్నీ ఆడుకోవటానికి చాలా అదృష్టం వుండాలి.
ప్రస్తుతానికి కీ బోర్డు, మౌసు తో గోటీ బిళ్ళ ఆడుతున్న. చాలా బాగా వ్రాసారు. చాలా సంతోషం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-16228880467599150342010-05-18T13:13:34.131-05:002010-05-18T13:13:34.131-05:00I and a couple of cousins of mine are the last of ...I and a couple of cousins of mine are the last of the advocates of such games in our circle. Now the generation of Jetix's world s(h)aving is ruling the roost atleast partially. అమెరికాలో ఉండీ ఇవన్నీ ఆలోచిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉందిగీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-65501618882211264572010-05-18T12:25:49.108-05:002010-05-18T12:25:49.108-05:00చాలా బావుంది. వర్ధమాన కథా రచయిత సుంకోజి దేవేంద్ర మ...చాలా బావుంది. వర్ధమాన కథా రచయిత సుంకోజి దేవేంద్ర మా మంఛి ఆటలు అని ఒక బుల్లి పుస్తకం రాశారు. దీన్ని విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించారు. కమ్మటి చిత్తూరు మాండలికంలో తాను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ రాశారు. ఇంకా దొరుకుతూ ఉండొచ్చు పుస్తకం.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-79725430718124154312010-05-18T11:34:16.055-05:002010-05-18T11:34:16.055-05:00good post :)good post :)Ranihttp://photodummy.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-70086841075475122582010-05-18T10:27:31.279-05:002010-05-18T10:27:31.279-05:00మీ స్వరంతో జత కలపటానికి చాలా స్వరాలే ఉన్నాయి!
మా ...మీ స్వరంతో జత కలపటానికి చాలా స్వరాలే ఉన్నాయి!

మా పిల్లలకి ఈ ఆటలు అన్నీ పరిచయమే. అష్టాచమ్మా(నాలుగు గవ్వల ఆట)బాగా ఇష్టం. చింతగింజలాట..వామనగుంటలు...అచ్చంగిల్లాలు తప్ప ఈ ఆటలన్నీ మా పిల్లలు ఆడతారు. మా ఇంట్లో మా అమ్మాయి తప్పితే అందరూ మగపిల్లలే..దాంతో తను కూడా వాళ్లతో పాటు వాళ్ల ఆటలే ఎక్కువ ఆడుతుంది.

ఇక ఎండాకాలం సెలవలకి మొన్న మొన్నటి దాకా మా పిల్లల్ని నెలరోజుల పాటు ఊర్లోనే ఉంచేసేవాళ్లం..అక్కడ ఇంకా మా కజిన్సు పిల్లలు అందరూ కలిసి పిచ్చపిచ్చగా ఆడుకునేవాళ్లు...తోటల్లో దొడ్లల్లో పడి తెగ తిరిగి కాకుల్లాగా మారి వచ్చేవాళ్లు. ఈ సంవత్సరమే ఇద్దరికీ చెరో సారి సెలవలవటం మూలాన మరియు మా అబ్బాయి ఇంటరు అవటం మూలాన వెళ్లలేదు పాపం.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-78224380004401903392010-05-18T09:40:05.736-05:002010-05-18T09:40:05.736-05:00బాల్యపు ఆటలంటే నేను ఎప్పుడూ పిల్లలతో నా బాల్యపు ఆట...బాల్యపు ఆటలంటే నేను ఎప్పుడూ పిల్లలతో నా బాల్యపు ఆటలే ఆడుతా...ఎందుకంటే నాకు అవితప్ప వేరే యే క్రొత్త ఆటలు రావు :) ఇంకా సమాజం పూర్తిగా మారిపోలేదు ఉష గారు మా ఊర్లో పిల్లలు ఇంకా ఆడుతున్నారు ఇవన్నీ కాకపోతే కార్టూన్ నెట్వర్క్ లో ఫెవరేట్ ప్రోగ్రాం రానపుడు మాత్రమే :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-21405758025024498622010-05-18T09:04:33.948-05:002010-05-18T09:04:33.948-05:00ఉష గారు మీరు చెప్పిన ఆటలన్నీ నేనూ ఆడేసానొఛ్.. గెలు...ఉష గారు మీరు చెప్పిన ఆటలన్నీ నేనూ ఆడేసానొఛ్.. గెలుపోటములు మాత్రం అడక్కండేం ..అన్నీ ఓడిపోవడమే నేను ఎప్పుడూ..ఎవరమ్మా అలా నవ్వేస్తున్నారు ..నాకు మీకులా దొంగాటలు ఆడటం రాదు అందుకే ఓడిపోవలసి వచ్చింది (ఇక్కడ ఒక బుంగమూతి ఊహించుకోండి :) తొక్కుడు బిళ్ళ,అష్టా చెమ్మా,వామన గుంటలు నా ఫేవరెట్ ఆటలు ..వైకుంఠ పాళి,కోకో పర్లేదు ఒక మాదిరిగా ఆడేదాన్ని. కరెంట్ పాస్ లో ఎప్పుడూ నేనే దొంగ :( కోకో .. కోలాటం కూడా ఆడేదాన్ని.. మా ఇంటిపక్కన తాతగారు పాడుతుంటే రెండు కర్రలు,పరికిణీ వేసుకుని తెగ ఆడేవాళ్ళం.. పాట కొద్దిగా గుర్తు ఉంది అటవి స్థలముల కేగుదమా ,వటపత్రంబులు కోయుదమా (కరెక్టేనా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-72808766815575837252010-05-18T08:22:06.449-05:002010-05-18T08:22:06.449-05:00చాలా దూరం తీసుకు వెళ్ళారండీ ఙ్ఞాపకలలో... మీ ప్రయత్...చాలా దూరం తీసుకు వెళ్ళారండీ ఙ్ఞాపకలలో... మీ ప్రయత్నం బాగుంది. ఎవరు గళం కలుపుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-9527118786498807682010-05-18T07:35:39.079-05:002010-05-18T07:35:39.079-05:00ఇంకా రావాలి సమాధానాలు. బాల్యపు ఆటలు సరేనర్రా..దాహం...ఇంకా రావాలి సమాధానాలు. బాల్యపు ఆటలు సరేనర్రా..దాహంతో బావి గట్టున కూర్చున్న మనిషి తీరు నాది. గుక్కెడు నీళ్ళు తోడి ఎవరైనా పోయకపోతారాని ఆశ/కల. :) ఈ ఆటలు ఆడాము అని కాదు, కొన్నైనా తర్వాతి తరానికి అందించాము అనగల భిన్న స్వరం నా గళానికి కలిపే (నేను అనుకున్నది చేస్తున్నాను అన్నది సత్యం కనుక) ఒక జంటస్వరం వినాలపి ఇంకా చూస్తున్నాను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-56513777267896669822010-05-18T07:20:14.666-05:002010-05-18T07:20:14.666-05:00ఊపిరి బిగపట్టి మరీ చదివాను మీ టపాని..అమ్మో ఇన్ని ఆ...ఊపిరి బిగపట్టి మరీ చదివాను మీ టపాని..అమ్మో ఇన్ని ఆటలు ఒక్కసారిగా గుర్తుకు తెచ్చేస్తే ఎలాగండీ?
ఇదిగోండి ఉష గారు, పిల్లకాయలకు ఆ ఏడుపెంకులాట నేర్పే కాంట్రాక్ట్ మాత్రం నాకే ఇవ్వాలండీ...:)
అలాగే వైకుంఠపాళీ లో పక్కనున్నోళ్ళకు తెలీకుండా పిక్కని ఎలా కదపాలి లాంటి టెక్నిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయండోయ్..అలా ఎన్నిసార్లు తొండి( కింత్రి చేయటం )చేసి పాము నోట్లోకి వెళ్ళకుండా తప్పించుకున్నానో!!

నేను కూడా ఇప్పటికిప్పుడు ఈ ఆటలు ఆడటానికి రెడీ Including తొక్కుడు బిళ్ళ...:)శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-41488180201794478922010-05-18T03:06:07.412-05:002010-05-18T03:06:07.412-05:00మరి ఇప్పుడెవరైనా ఈ ఆటలు ఆడుతుంటే నేను రెడీ!:):)మరి ఇప్పుడెవరైనా ఈ ఆటలు ఆడుతుంటే నేను రెడీ!:):)padmarpitahttp://padma4245.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-76698777536736369492010-05-18T02:04:49.771-05:002010-05-18T02:04:49.771-05:00ఏంటి ఉషమ్మా..ఒక్కసారే ఇన్నేసి బాల్యస్మృతుల్ని గుర్...ఏంటి ఉషమ్మా..ఒక్కసారే ఇన్నేసి బాల్యస్మృతుల్ని గుర్తు చేసేస్తే ఎలా!
అన్ని ఆటలు ఆడినవే..ప్రతి దాంట్లో గెలుపు కోసం పోరాటమే..ఓడిపోతే ఉక్రోషాలు..తొండాటలు..తగువులు..అలకలు..మూతి బిగించుకోవటాలు..ఇవన్నీ చెయ్యని తెలుగింటి పిల్లలు ఉంటారా?

సబ్ జావ్ ఇండోర్..మా సంక్షిప్త నామం..సబ్జా

చింతగింజలాటలో మనల్ని కొట్టినవాళ్లు లేరు. ఎండాకాలం..పచ్చళ్లకని చింతపండు మణుగులు మణుగులు తెచ్చేవాళ్లు..దాంట్లొ ఒక్క చింతగింజ పారేసినా ఊరుకునేవాళ్లం కాదు. అవన్నీ సంవత్సరాల తరబడి మా అమ్మ దాచిపెట్టి పుచ్చిపోయినాక పారబోసింది. చింతగింజల బదులు బాడిద గింజలతో కూడా ఆడేవాళ్లం..కానీ ఇవి పెద్దగా ఉండటాన ఎక్కువ పట్టలేకపోయేవాళ్లం.

ఐదు గుర్రాలు ఒక ఏనుగు.....వరసగా 5..4..3...2..1 లేక 7..6..5..4..3..2..1 గుర్రాలతో రథం కట్టేవాళ్లం...

ఇంకా ముక్కు గిల్లుడు ఆట..పిన్నీసులాట..కుందుళ్ళాట..ఉప్పాట..చెమ్మచెక్క..ఆసంబాయి..కరంటు పాస్...స్థంభాలాట..అబ్బో ఇంకో రెండు టపాలు వ్రాయవచ్చు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-84589454942694905142010-05-18T00:30:48.211-05:002010-05-18T00:30:48.211-05:00అబ్బో! పుట్టింది పెరిగింది పట్నంలోనైనా మేమూ ఆడాం బ...అబ్బో! పుట్టింది పెరిగింది పట్నంలోనైనా మేమూ ఆడాం బోల్ఢు ఆటలు. అప్పుడూ స్కూలులో చదువులూ, ఆటలు ఉన్నా ఆదివారం, వేసవి సెలవులు అంటే ఎన్ని ఆటలో. ఆప్పట్లో టీవీలు లేవు, కంప్యూటర్లు లేవు. బొమ్మల పెళ్లిల్లు, పూలజడలు , ఊయలూగడం మాత్రం తప్పనిసరి వేసవి సెలవుల్లో. ఒక్క బిజినెస్ గేమ్ తప్ప అన్నీ తెలుగు ఆటలే. వీటివల్ల శరీరానికి కూడా ఎంత వ్యాయామమో కదా ఉషా.. నా ఆటల ముచ్చట్టు నేను ఎప్పుడో చెప్పేసానుగా.

http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html

http://jyothivalaboju.blogspot.com/2009/10/blog-post_10.htmlజ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com